Monday, June 17, 2024

మెద‌క్ జిల్లాలో విషాదం..

తప్పక చదవండి

ఇద్ద‌రు పిల్ల‌ల‌తో స‌హా త‌ల్లి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న‌ మెద‌క్ జిల్లాలో కొంటూరు గ్రామంలో చోటు చేసుకుంది. చెరువు వ‌ద్ద మృత‌దేహాల ఆన‌వాళ్లు క‌నిపించ‌డంతో స్థానికులు పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను చెరువులో నుంచి బ‌య‌ట‌కు వెలికితీశారు. మృతుల‌ను మెద‌క్ మండ‌లం వెంక‌టాపూర్‌కు చెందిన‌ కొక్కు ల‌క్ష్మీ(22), కుమార్తెలు శ‌ర‌ణ్య‌(4), చిన్నారి(2) గా పోలీసులు గుర్తించారు. భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డి కుమార్తెల‌తో స‌హా ల‌క్ష్మీ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతురాలి త‌ల్లిదండ్రులు, బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు