Wednesday, June 19, 2024

మహేంద్ర ఫైనాన్స్ వేధింపులు తాళలేక ముగ్గురు ఆత్మహత్య..

తప్పక చదవండి
  • మహేంద్ర ఫైనాన్స్ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబాల నిరసన..
  • బాధిత కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం అందించాలి : మందా సైదులు..

మధిర పట్టణంలోని మహేంద్ర ఫైనాన్స్ వద్ద రుణాలు తీసుకున్న బాధితులు వాయిదాలు చెల్లింపు క్రమంలో ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు చేసిన వేధింపుల వల్ల ఇటీవల
ఖమ్మంపాడు గ్రామం నందు ముగ్గురు చిన్న రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి కొంతమంది తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు రీత్యా ఒకటి లేదా రెండు కిస్తీలు చెల్లింపులో జాప్యం జరిగినప్పుడు సిబ్బంది సరాసరి ఇంటికి వెళ్లి ఇంటి లోపలికి వెళ్లి మహిళలను, పిల్లలను బయటకు వెళ్ళండి తలుపులు వేస్తామని బెదిరిస్తున్నారు అని ఖమ్మంపాడు గ్రామానికి చెందిన మహిళ రైతు వజ్రమ్మ తెలియజేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు