Monday, April 29, 2024

న్యాయం జరిగింది..

తప్పక చదవండి
  • మధ్యప్రదేశ్ కూలీకి నష్టపరిహారం చెల్లింపు
  • మంగళ కుటుంబానికి రు.లక్ష చెక్కు అందజేసిన డిఎం చంద్రమోహన్..
  • ఆదాబ్ కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం..

అడవిలో మృతి చెందిన మధ్యప్రదేశ్ కూలి కుటుంబానికి న్యాయం జరిగింది.. ఆదాబ్ హైదరాబాద్ మధ్యప్రదేశ్ కూలీ కుటుంబానికి న్యాయం చేయాలంటూ పోరాడిన పోరాటం ఫలించింది. మృతి చెందిన కూలీ కుటుంబానికి సరిగ్గా ఐదు నెలలకు నష్టపరిహారం చెక్కు రూపంలో అందింది. ఒకవైపు ఆదాబ్ హైదరాబాద్, మరోవైపు సంబంధిత స్థానిక అధికారులు బాధిత కుటుంబానికి చేయాలనుకున్న న్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టి ఎస్ ఎఫ్ డి సి ) సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని చంద్రయపాలెం గ్రామం వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో బొంగు చెట్లను నరికేందుకు మధ్యప్రదేశ్ కు చెందిన కూలీలను తీసుకువచ్చారు. అయితే బొంగు చెట్లను నరుకుతున్న క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలగడ్ జిల్లా మౌలా గ్రామానికి చెందిన కూలి మడకం మంగ్ల మృతి చెందాడు. అతని మృతిపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆదాబ్ హైదరాబాద్ ఏడాది ఫిబ్రవరి 18న “మంట కలిసిన మానవత్వం, మధ్యప్రదేశ్ కూలీల అరణ్య రోదన, ఎండలో పడిగాపులు, మృత్యు ఒడిలోకి కూలి,అడవిలో పూడ్చిన వైనం” అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంతో స్పందించిన టీఎస్ ఎఫ్ డి సి ఎండి చంద్రశేఖర్ రెడ్డి స్పందించి సీనియర్ డిఎం స్కైలాబ్ ను విచారణ అధికారిగా నియమించారు. విచారణ ప్రారంభం కావడంతో “మధ్యప్రదేశ్ కూలి మృతి పై విచారణ, కూలీల వాంగ్మూలం సేకరణ” అంటూ 21న మరో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాలతో స్పందించిన అధికారులు నిబంధనల ప్రకారం ఆ కుటుంబానికి న్యాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆదాబ్ హైదరాబాద్ తో పాటు సంబంధిత అధికారులు సైతం బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఈ కృషి ఫలితంగా రూ లక్ష రూపాయల ఆర్థిక సహాయం మృతుడు మడకం మంగళ భార్య పేరుతో చెక్కు మంజూరు అయింది. దీంతో మంగళ కుటుంబీకులను టి ఎస్ ఎఫ్ డి సి కొత్తగూడెం డి ఎం చంద్రమోహన్ మధ్యప్రదేశ్ నుంచి శనివారం పిలిపించి చెక్కును అందజేశారు. చెక్కు అందుకున్న మంగళ కుమారులు మడకం కమల్, మంతె సింగ్ లు ఆదాబ్ హైదరాబాద్ తో పాటు డి ఎం చంద్రమోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆదాబ్ కృషి ఫలితంగానే తమకు న్యాయం జరిగిందని ధన్యవాదాలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు