Friday, October 11, 2024
spot_img

నడి రోడ్డుపై మద్యం బాటిళ్లు..

తప్పక చదవండి
  • తుని సమీపంలో ఓ వ్యాన్ బోల్తా పడింది..
  • తుని సమీపంలో రోడ్డుపై వ్యాన్ బోల్తా
  • లిక్కర్ బాటిల్స్ ఎత్తుకెళ్లిన జనాలు
  • ట్రాఫిక్‌కు అంతరాయం
    కాకినాడ జిల్లా తుని మండలం గవరయ్య కోనేరు దగ్గర మద్యం బాటిళ్ల లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో కొన్ని బాటిళ్లు ధ్వంసంకాగా.. మద్యం బాటిళ్ల కోసం జనాలు ఎగబడ్డారు. ఛాన్స్ దొరికిందిలే అనుకుంటూ బీర్లు, మద్యం బాటిళ్లను దొరికినవాళ్లకు దొరికినట్లు ఎత్తుకెళ్లారు. వ్యాన్‌లో ఉన్నవాళ్లు తీసుకెళ్లొద్దని మొత్తుకున్నా సరే ఎవరూ పట్టించుకోలేదు.. అయితే కొందరు మాత్రం సాయం చేశారు. వ్యాన్ బోల్తాపడినట్లు సమాచారం అందడంతో.. కొద్దిసేపటి తర్వాత పోలీసులు, పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు మద్యం బాటిళ్లు తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. కానీ అప్పటికే చాలామంది బాటిల్స్ తీసుకెళ్లారు.
    సామర్లకోట నుంచి మద్యం లోడుతో తుని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మినీ వ్యాన్ టైర్ పంక్చర్ కావడంతోనే లారీ బోల్తాపడినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ని క్రమబద్దీకరించారు. ఆ తర్వాత మరో వాహనంలో ఈ మద్యం బాటిళ్లను అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఒకటి రెండు జరిగాయి. రోడ్డుపై అలా బాటిల్స్ కనపడగానే జనాలు ఇలా వచ్చేశారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు