- జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరుకై వినతిపత్రం సమర్పణ..
- మంత్రి సబితా సూచనల మేరకు కలెక్టరేట్ కి వెళ్లిన జేఏసీ నాయకులు..
- సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ తిరుపతి రావు..
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరుకై శుక్రవారం నాడు.. ఎల్.బీ. నగర్ జర్నలిస్ట్ జేఏసీ కమిటీ సభ్యుల బృందం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుపతి రావును కలిసి అర్హులైన జర్నలిస్టుల జాబితాతో పాటు.. వినతిపత్రాన్ని అందజేశారు.. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వీ.ఎన్. రాజు (దిశ రాజు) మాట్లాడుతూ.. ఎల్.బీ. నగర్ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో అర్హులైన జర్నలిస్ట్ లందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ. సబితా ఇంద్రారెడ్డి సూచనల మేరకు ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం సమర్పించాలని ప్రతినిధుల బృందంతో కలిసి వచ్చామని.. సమయానికి కలెక్టర్ అందుబాటులో లేని కారణంగా.. జాయింట్ కలెక్టర్ తిరుపతి రావుని కలిసి, జర్నలిస్టుల లిస్ట్ తో బాటు, వినతి పత్రం సమర్పించామని.. దీనికి జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి.. ఈ విషయాన్ని కలెక్టర్ హరీష్ దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పారని తెలిపారు.. అర్హులైన జర్నలిస్ట్ మిత్రులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యేంతవరకు నిరంతరం పోరాటం సాగిస్తామని.. ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.. జాయింట్ కలెక్టర్ ని కలిసిన వారిలో జేఏసీ కో – చైర్మన్ పగడాల దేవయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్.బీ.ఎన్. చారి (బాలు ), సహాయ కార్యదర్శి కడారి శ్రీనివాస్, కోశాధికారి కొమ్ము రాజు లు ఉన్నారు.. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిథి బృందం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి,జాయింట్ కలెక్టర్ తిరుపతి రావుకి కృతజ్ఞతలు తెలియజేశారు..