Wednesday, October 9, 2024
spot_img

సినిమాలు – జ్యోతిష్యం..( శ్రీ రుద్రపీఠం, దేవముని దేవదైవజ్ఞ వారి విశ్లేషణాత్మక కథనం.. )

తప్పక చదవండి

కీర్తిని, గ్లామర్ నే కాకుండా మిమ్మల్ని సెలబ్రిటీలను చేసి మీకు అభిమానులను ప్రపంచవ్యాప్తంగా తెచ్చి పెట్టేది ఒకేఒక్క పరిశ్రమ సినిమా పరిశ్రమ మాత్రమే.. ఒక నటుడు సామాన్యముగా కనిపించినా అతనిని కోట్లాదిజనులలో నుండి ప్రత్యేకమైన వ్యక్తిగా చేసేది, అతనిలో గల ప్రత్యేకమైన ఆకర్షణ, ప్రేక్షకులలో అతనికి గల ప్రత్యేకమైన ఆదరాభిమానములు మాత్రమే.. మీరు నటనను విజయవంతమైన వృత్తిగా మార్చుకొని స్థిరపడాలనుకుంటే జ్యోతిష్యశాస్త్రం ప్రకారము కొన్ని గ్రహాల ప్రభావం మీకు ప్రత్యేకంగా ఉండి తీరవలసిందే.. లేనిచో ఒడిదుడుకులుగానే ఉండి ఫెయిల్యూర్స్ గానే మిగిలిపోతారు.. నటజీవితంలో నక్షత్రాల పాత్ర ఎంతగానో ఉంటుంది.. వాటిలో రోహిణి, మృగశిరా, మఘ, పూర్వాఫాల్గుణి, చిత్తా, స్వాతి, పూర్వాషాఢ, రేవతి నక్షత్రములు..

రోహిణి : ఈ నక్షత్రం కళలు, నటన, అందం, ఫ్యాషన్, సంగీతాన్ని సూచిస్తుంది..
మృగశిరా : ఈ నక్షత్రం సరికొత్త కోణంలో మీకు గల సృజనాత్మకతను సూచిస్తుంది..
చిత్త : ఈ నక్షత్రం మీలో గల సాంకేతిక, సృజనాత్మకతను, పోరాట సామర్ధ్యాన్ని సూచిస్తుంది..
స్వాతి : ఈ నక్షత్రం మీలో గల స్వతంత్రంగా, స్వేచ్ఛగా, అసాధారణంగా ఉండే శక్తి, సామర్ధ్యములు సూచిస్తుంది..
పూర్వాభాద్ర : ఈ నక్షత్రం మీలోని విలక్షణమైన లక్షణములను అందరి కన్నులలో పడేటట్లు చేసి అందరి అభిమానములను పొందునట్లు చేస్తుంది..
రేవతి : ఈ నక్షత్రం మీలోని బహుస్వతంత్రబుద్ధిని, సహజజ్ఞానమును సూచిస్తుంది..

- Advertisement -

నటనకు సంబంధించి బాధ్యత వహించు గ్రహములు ఏవనగా… చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, రాహువు..

చంద్రుడు :
చంద్రుడు మనస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాడు. సినిమాలు మనస్సుకు నచ్చుతాయి. హృదయానికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మీ జాతకంలో బుధుడు, శుక్రుడు బలంగా ఉన్నట్లయితే మీరు నటులుగా స్థిరపడగలరు.. కానీ మీరు సూపర్ స్టార్ కావాలంటే మాత్రం బలమైన చంద్రుడు మాత్రం ఖచ్చితంగా ఉండి తీరవలసిందే.. బలమైన చంద్రుడు మిక్కిలి ప్రజాదరణను కలిగిస్తాడు.. వీరు కోటానుకోట్ల ప్రజల హృదయాలను గెలుచుకునే శక్తిని, ప్రభావితం చేయగల సామర్త్యాన్ని కలుగ చేస్తాడు.

సూర్యుడు :
ఈ అందాల ఆకర్షణీయ సినిమా ప్రపంచంలో మంచి కీర్తిని సంపాదించాలంటే సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో ఉండాలి..

బుధుడు :
జాతకంలో బలమైన బుధుడు గలవారు నటనలో అద్భుతమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఇతడు అత్యద్భుతమైన నైపుణ్యాన్ని అభివ్యక్తం చేయగలడు..

శుక్రుడు :
ఈ గ్రహం బలంగా ఉన్న జాతకుడు ఆకర్షణీయమైన రూపాన్ని, అద్భుతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. శుక్రబలం బలంగా ఉన్న వ్యక్తులు నటజీవితంలో ఎన్నో అద్భుతమైన విజయాలను సాధిస్తారు.. టీవీ, మీడియా, చలనచిత్ర పరిశ్రమలకు చెందిన వ్యక్తులకు బలమైన శుక్రుడు ఉంటాడు.

కుజుడు :
కుజుడు శక్తి, ఉత్సాహానికి కారకుడు.. ఇది వ్యక్తిని చురుకుగా ఉంచుతుంది.. చురుకుగా ఉన్నవాడు ఎలాంటి నటనకైనా, ముఖ్యంగా యాక్షన్ చిత్రాలు చేయడంలో చురుకుదనాన్ని ప్రదర్శిస్తాడు.

శని :
ఎటువంటి కష్ట, క్లిష్ట పరిస్థితిలోను పనిచేయడానికి శని మీకు ప్రేరణను ఇస్తుంది.. ఏ రంగంలోనైనా సుదీర్ఘ కెరీర్ కోసం శని యొక్క ఆవశ్యకత ఎంతో అవసరం కావున శని మంచిస్థానంలో ఉండటం నటీనటవృత్తికి అవసరం.

రాహువు :
ఇది చాలా ముఖ్యమైనది.. ఎందుకంటే స్క్రీన్ పై చూపబడేది ఎప్పుడూ నిజం కాదు. కానీ అది నిజమే అనునట్లుగా భ్రాంతిని సూచిస్తుంది..

గ్రహస్థితులు ఎప్పుడూ ఒకే విధముగా ఉండవు. కాబట్టి సినీ, రంగస్థలం రంగంలో ఉండేవారు తమలో ఆకర్షణ, వశీకరణ, సమ్మోహనాదులు తగ్గకుండా తరచుగా అప్పుడప్పుడు తమ తమ ఇంటియందు భువనేశ్వరీ దేవి యాగమును, ఆకర్షణ స్థిరముగా ఉండి ఎప్పుడూ సఫలము కావడానికి మాతంగిదేవి యాగమును, ఆర్ధిక ఇబ్బందులు దరిచేరకుండా ఉండుటకు షోడశీదేవియాగమును సినిమా, టీవీ పరిశ్రమలలోని వారు చేయుట లేదా చేయించుకొనుట తప్పనిసరి..

వివరములకు శ్రీ రుద్రపీఠం, దేవముని దేవదైవజ్ఞ వారిని సంప్రదించగలరు.. 9346053953..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు