Saturday, July 27, 2024

బీసీల అభ్యున్నతికి కృషిచేసేందుకు ఒడ్డే ఓబన్న లాంటి మహనీయులు కృషి చేశారు..

తప్పక చదవండి
  • వారి ఆశయాలు అనుసరించడం ఎంతో అవసరం..
  • ఎన్‌ఎంఆర్‌ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్‌ వెల్లడి..
  • ఒడ్డే ఓబన్న చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన నీలం మధు..

హైదరాబాద్ : పటాన్ చెరువు మండలం, చిట్కుల్‌ గ్రామంలో ఎన్‌ఎంఆర్‌ యువసేన కార్యాలయంలో వడ్డే ఓబన్న వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నీలం మధు ముదిరాజ్‌ పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. బీసీ గడ్డగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తరుపున, ప్రజల మనిషిగా ఈ ఎన్నికల్లో మీ ముందుకు వస్తానని ఎన్‌ఎంఆర్‌ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్‌ తెలిపారు. నాయకునిగా కాకుండా ఓ వ్యక్తిగా ప్రజల గొంతుగా బీసీ బిడ్డగా.. మీలో ఒకనిగా నిరంతరం మీ అభ్యున్నతికి పాటుపడతానని తెలిపారు. మన జనాభా శాతం ఎంత మనం ఎక్కడున్నాం అనే ప్రతీ ఒక్కరూ ఆలోచించుకోవాలని తెలిపారు. ముదిరాజ్‌ జాతిని, బీసీ సంఘాలను దూరం పెట్టడం అన్యాయం అని అన్నారు. నోటీఫికేషన్‌ వచ్చిన తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా పాదయాత్రగా ప్రతీ ఇంటికీ నేను ప్రజల్లోకి ఎలా వెళ్తానని తెలయజేస్తామని ఆయన తెలిపారు. ప్రతీగడపకూ వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని గ్రామల్లో పట్టణాల్లో తిరిగి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తా అని తెలిపారు. గత నాలుగేళ్లు ఎన్‌ఎంఆర్‌ యువసేన, అభిమానులు, అనుచరులు, బంధువులు అన్నివర్గాలతో కలుపుకుని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. నీలం మధు ముదిరాజ్‌ను రాష్ర్టవ్యాప్తంగా తెలిసేలా చేసినవి ఈ సేవాకార్యక్రమాలే, పటాన్‌చెరు గడ్డ మీద నాకు సబ్బండ వర్గాల మద్దతు ఉంది అన్నారు. అసెంబ్లీ టికెట్‌ కేటాయించకపోవడంతోనే ముదిరాజ్‌ లను దూరం పెడతారా అంటూ వారిలో చైతన్యం పెరిగి అందరూ ఒక్కతాటిపైకి వచ్చిపోరాడుతున్నారని తెలిపారు. బీసీ సబ్బండ వర్గాలకోసం నిరంతరం పోరాడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వెంకటేశ్, మురళీ, రాజ్ కుమార్, ఈశ్వర్, దస్తగిరి, ఎల్లప్ప, రాజు, జగదీష్, కృష్ణ, ఎన్.ఎం.ఆర్. యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు