Tuesday, May 14, 2024

కబ్జాదారుల కబంధ హస్తాల్లో..తల్లి లేని పిల్లల భూమి

తప్పక చదవండి
  • వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో పెట్రేగిపోతున్న కబ్జాదారులు..
  • సర్వే నెం.303/ఏ/1 మైలగాని శివయ్య పట్టా భూమి..
  • నాలా కన్వర్షన్ లేదు..లేఅవుట్ అనుమతి లేదు..
  • బోగస్ హద్దులను చూపుతూ దొడ్డి దారిన రిజిస్ట్రేషన్ చేసుకున్న కబ్జారాయుళ్లు..
  • శివయ్య సర్వే నెంబర్ చూపుతూ ఐలు కోమురు భూమి కబ్జాకు యత్నం..
  • కబ్జాదారుల పై వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించాలంటు డిమాండ్..

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో శనిగరం గ్రామ శివారులో సర్వే నెంబర్ : 303/ఏ/1లో మైలాగని శివయ్య కు చెందిన పట్టా భూమిగా రెవిన్యూ రికార్డుల ప్రకారం ఉంది..ఇట్టి భూమి నేటికీ వ్యవసాయ భూమిగానే ధరణిలో నమోదై ఉంది.. భూ కబ్జాలకు పాల్పడే వ్యక్తులు వారి వక్ర బుద్దిని చూపి మైలగాని శివయ్యకు చెందిన సర్వే నెంబర్ 303/ఏ/1 ని చూపుతూ సాదం ఐలు కోమురుకు చెందిన భూమిని కబ్జా చేయుటకు యత్నించారని బాధితుడు ఐలు కోమురు ఆరోపించాడు.. బోగస్ పత్రాలతో బోగస్ హద్దులను చూపి అక్రమంగా ఎలాంటి లే అవుట్ అనుమతి లేకుండా దొడ్డిదారిన ప్లాట్ల పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఈ ప్రాంతంలో బహిరంగ చర్చలు వినిపిస్తున్నాయి.. శనిగరం శివారులో 2023 వరకు ఒక్క లే అవుట్ అనుమతి లేదని, ఎవ్వరూ కూడా దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, అలా ఎవరైనా ప్లాట్ల పేరుతో కొనుగోలు చేస్తే.. గ్రామ పంచాయితీ నుండి అనుమతులు ఇవ్వరని నల్లబెల్లి మండల ఎంపీఓ కూచన ప్రకాష్ గతంలోనే తెలిపారు.. ఎవరైనా అక్రమంగా ప్లాట్లకు గ్రామ పంచాయితీ నుండి అనుమతులు పొందినట్లు ఎంపీఓ దృష్టికి వస్తే పంచాయితీ రాజ్ చట్టం 2018 నిబంధనల ప్రకారం అట్టి అనుమతులు రద్దు చేస్తామని, కాబట్టి అనుమతులు లేని లే అవుట్ లో ఎవరూ ప్లాట్లు కొనద్దని గతంలోనే హెచ్చరించారు.. ప్రస్తుతం గంగదేవిపల్లిలో గాడుదల రాజు కుమార్ ఇంటి దగ్గర నివాసం ఉంటున్న సాదం ఐలు కోమురు గురువారం రోజున మధ్యాహ్న సమయంలో తన భూమిలో అక్రమంగా తాను లేని సమయం చూసి కబ్జా చేయుటకు.. రెండు తాత్కాలిక రూములు నిర్మించి కబ్జా చేయుటకు నిర్మించిన నిర్మాణాలను తాను జేసిబి సహాయంతో కూల్చి వేసినట్లు తెలిపారు.. ఐలు కోమురు తన తమ్ముని పిల్లలకు నల్లబెల్లి గ్రామ సర్పంచ్ రాజారాం సమక్షంలో రాసి ఇచ్చిన భూమిని.. అదికూడా తల్లి లేని పిల్లలకు చెందుతుందని ఐలు కోమురు భూమి ఎవరికీ అమ్మలేదని అన్నారు.. ఇప్పటికే మండలంలో రాజకీయాల్లో తిరుగుతున్న కాంగ్రెస్ నాయకుడు చిట్యాల తిరుపతి రెడ్డి తన భార్య కవిత పేరుపై ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా పట్టా చేసుకున్నారని, ప్రస్తుత నల్లబెల్లి మండల ఎంపిపీ భర్త ఊడుగుల ప్రభాకర్ (అలియాస్ ప్రవీణ్), గోపగాని కుమారస్వామి, వైనాలా వీర స్వామి, చింత కింది శ్రీహరి అనే వ్యక్తులు తన భూమిని అక్రమంగా, డబ్బులు ఇవ్వకుండా, తల్లిలేని పిల్లలకు రాసి ఇచ్చిన భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపించాడు.. వరంగల్ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఐలు కోమురు కుటుంబ సభ్యులు నీలదియగా వైనాలా వీరాస్వామి, చింత కింది శ్రీహరి అనే వ్యక్తులు అప్రూవర్ గా మారి తిరిగి ఐలు కోమురు భూమి ఐలు కోమురుకు పట్టా చేయుటకు స్లాట్ బుక్ చేశారని తెలిపారు.. రాజకీయ ఒత్తిడితో కబ్జా దారులతో ములాఖాత్ అయిన తహశీల్దార్ దూలం మంజూల దరణిలో స్లాట్ బుక్ అయిన తరువాత దానిని అపే హక్కు ఎవరికీ లేదని తెలిపిన కేటీఆర్ మాటలు బేఖాతరు చేసి, తల్లి లేని పిల్లలకు చెందాల్సిన భూమిని తిరిగి పట్టా చేయకుండా నిలుపుదల చేసిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.. జిల్లా కలెక్టర్ ను సైతం తప్పుదోవ పట్టించిందని అన్నారు.. పట్టా చేస్తానని స్లాట్ బుక్ అయిన తరువాత రెండు రోజులు కరెంట్ లేదని, సర్వర్ పని చేయడం లేదంటూ కాలయాపన చేసి, భూ కబ్జాలకు పాల్పడే వ్యక్తుల నుండి ముడుపులు తీసుకొని తమకు పట్టా చేయలేదని ఆరోపించారు.. ఐలు కోమురు దగ్గర నుండి అక్రమంగా పట్టా చేసుకున్న వ్యక్తులకు కాసులకు కక్కుర్తిపడి, వారు ముడపులు ఇవ్వగానే పట్టాలోని కొంత కొంత భాగాన్ని మాత్రమే ఇదే తహశీల్దార్ నాలా కన్వర్షన్ చేసిందని తెలిపారు..నాలా కన్వర్షన్ చేసిన తహశీల్దార్ దూలం మంజూల తాను నాలా కవర్షన్ చేసిన భూమి ఎప్పుడో ప్లాట్లు అయ్యాయని మాట మార్చి, కబ్జా దారులకు తొత్తుగా మారి జిల్లా కలెక్టర్ కు తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే ఈ తహశీల్దార్ అవినీతికి అద్దం పడుతుంది.. అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించి నల్లబెల్లి మండల తహశీల్దార్ అక్రమాలపై విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేశారు.. ఈ అక్రమ వ్యవహారంపై ఒక వైపు ఐలు కోమురు ఉన్నతాదికారులకు పిర్యాదు చేసి, న్యాయం కోసం తిరుగుతుంటే, ఇప్పుడు మా ప్లాటు ఉందంటూ పెద్దర బోయిన బిక్షపతి అనే వ్యక్తి ఐలు కోమురు పక్కన ఉన్న మైలగాని శివయ్య పట్టా భూమి సర్వే నెంబర్ 303/ఏ/1 లో ప్లాటు అంటూ నకిలీ పత్రాలు సృష్టించి, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని, ఐలు భూమిలోకి అక్రమంగా ప్రవేశించి, పనులకు అడ్డుపడ్డారని అన్నారు.. 100కి బిక్షపతి అనే వ్యక్తి కాల్ చేస్తే అక్కడికి వచ్చిన పోలీస్ అధికారులు సాధం ఐలు కోమురు, ఇతగాడి బామ్మర్ది గాడుదల రాజులను స్టేషన్ కి వెళ్లి పిర్యాదు చేయాలని సూచించారని, జేసిబి వాహనాన్ని అధికారులు అక్కడ నుండి పంపించారని అన్నారు.. దీనితో వారు వెళ్లి పోలీస్ స్టేషన్ లో గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పిర్యాదు చేసినట్లు తెలిపారు.. బిక్షపతి అనే వ్యక్తి సర్వే నెంబర్ 303/ఏ/1.. అది మైలగాని శివయ్యకు సంబంధించిన పట్టా భూమి, ఒకవేళ వారికి ప్లాటు ఉంటే శివయ్య భూమిలో ఉండాలి.. తన భూమిలో ఎలా ఉంటుందని అన్నారు.. బోగస్ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న బిక్షపతి, మొగిలి, ఎర్ర రజీనికర్ లు చూపిన సర్వే నెంబర్ ధరణిలో శివయ్య పేరున పట్టాగా ఉండడంతో.. సాదం ఐలు కోమురు చెప్పిన మాటలు వాస్తవమేనని తేట తెల్లమవుతుంది.. వరంగల్ జిల్లా పోలీస్ కమిషనర్ రంగనాథ్ నల్లబెల్లి మండలంలో నాయకత్వ ముసుగులో చేస్తున్న నాయకుల కబ్జాలపై, తహశీల్దార్ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకొని తనకు న్యాయం చేసి తాను తల్లి లేని చిన్న పిల్లలకు రాసి ఇచ్చిన భూమిని వారికి చెందేలా న్యాయం చేయాలని కోరాడు…

నల్లబెల్లి సర్పంచ్ రాజారాం :
సాదం ఐలుకోమురు భూమి విషయంలో, ఐలు కోమురు తమ్ముని భార్య చనిపోయిన తరువాత వారి పిల్లలు చిన్న పిల్లలు కావడంతో ఐలు కోమురుకు చెందిన 0.37 గుంటల పట్టా భూమిని గంగదేవిపల్లి గ్రామ సర్పంచ్ కూసం రాజమౌళి, పలువురు గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో పిల్లలకు చెందుతుందని రాసిన విషయం వాస్తవమేనని అన్నారు.. తల్లిలేని పిల్లలకు చెందాల్సిన భూమిని ఎవరు కబ్జా చేస్తామన్న సహించేది లేదని అన్నారు.. పిల్లలకు రాసి ఇచ్చిన కాగితం ప్రకారం వారికే చెందాలని, కావాలంటే వరంగల్ పోలీస్ కమిషనర్ దగ్గరకు తాను వచ్చి వాస్తవాలు చెప్తానని అన్నారు..

- Advertisement -

పట్టాదారుడు మైలగాని శివయ్య :
నల్లబెల్లి మండలంలో శనిగరం శివారులో ఖాతా నెంబర్ 207 సర్వే నెంబర్ 303/ఏ/1 తనకు చెందిన పట్టా భూమి అని అన్నారు.. తాను రైతు బందు సైతం పొందుతున్నానని, తాను ఎవరికీ భూమి అమ్మలేదని అన్నారు.. పెద్దరబోయిన బిక్షపతి, మొగిలి, ఎర్ర రజీనికర్ అనే వ్యక్తులు ఇటీవలే పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన పిర్యాదులో తన సర్వే నెంబర్ ఎలా పెట్టారో తనకు తెలియదని అన్నారు.. ఓ పత్రికలో తనకు చెందిన భూమిని వేరే వారిదిగా రాయడం ఏంటని..? ధరణి రికార్డ్ లో పట్టా ఎవరి పేరున ఉందో.. ఒక్కసారి చూడాలని అన్నారు.. భూముల రేట్లు అధికం కావడంతో భూ కబ్జాలకు పాల్పడే వ్యక్తులు పేదవారినే టార్గెట్ చేసి, కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు.. ఐలు కోమురుని తన భూమిని ఎన్ని సార్లు అమ్మాలని అడిగినా.. అది వారి తమ్ముని పిల్లలకు రాసి ఇచ్చిన భూమి అని, అమ్మడం కుదరదని చెప్పినట్లు తెలిపారు.. ఐలు కోమురు తమ్ముని భార్య బతికి ఉన్నంత కాలం వ్యవసాయం చేసిందని అన్నారు.. పక్కనే ఉన్న తన సర్వే నెంబర్ 303/ఏ/1 వేసుకొని బోగస్ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఐలు కోమురు భూమి కబ్జా చేస్తున్నారని.. దీనిపై వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించాలని కోరారు.. ఇలా వీరు ఎన్ని కబ్జాలు చేస్తున్నారో.. ఐలు కోమురు కు తల్లి లేని పిల్లలకు చెందాల్సిన భూమిని కబ్జా చేయడం దారుణమని, వారికి కూడా న్యాయం చేయాలని, తాను సైతం పూర్తి ఆధారాలతో వరంగల్ పోలీస్ కమిషనర్ కు పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు..గ్రామ పంచాయితీ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వద్దని.. దరణిలో రికార్డు ప్రకారం పట్టా ఎవరి పేరున ఉందో చూసుకొని అనుమతులు ఇవ్వాలని అన్నారు.. న్యాయం కోసం అవసరైతే కోర్టును సైతం ఆశ్రయిస్తామని తెలిపాడు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు