- వెల్లడించిన బీజేపీ నాయకులు నంగి దేవేందర్ రెడ్డి..
నిబద్దత సమర్థవంతమైన నాయకుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ నాయకులు నంగి దేవేందర్ రెడ్డి.. కిషన్ రెడ్డి ఎంతో సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న నేత.. బీజేపి అధిష్టానం తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించడంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.
కిషన్ రెడ్డి 1977లో జనతాపార్టీలో యువ నాయకుడిగా ప్రవేశించి, 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి, అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున తన సేవలు అందిస్తుండంటం తన నిబద్దతకు తార్కాణం. 1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టారని, 1983 నాటికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి, 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు.. 1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శిగా, 1992లో ఉపాధ్యక్ష పదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను పొంధారని, 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను పొందిటం అనేది సాధారణ విషయం కాదన్నారు..
కిషన్ రెడ్డి 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టగా, 2009 ఎన్నికలలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27,000 పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొంది వరుసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించారని, 2010, మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై బండారు దత్తాత్రేయ నుండి పార్టీ పగ్గాలు స్వీకరించారు. 2014 ఎన్నికలలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 62, 598 ఓట్ల మెజారిటీతో వరుసగా మూడోసారి శాసనసభలో ప్రవేశించారని, ఆ తారువాత 2014 లో మరలా తెలంగాణ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019 లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో సికింద్రాబాద్ నుండి గెలిచి నరేంద్ర మోదీ క్యాబినెట్ లో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు.. 2021లో క్యాబినెట్ విస్తరణలో భాగంగా సాంస్కృతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖకి కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి అనుభవమున్న వ్యక్తికి బాధ్యతలు ఇవ్వడం అనేది శుభపరిణామం అన్నారు బీజేపీ నాయకులు నంగి దేవేందర్ రెడ్డి..