మెగా ఇంటి కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అపోలో హాస్పిటల్ బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా పలు రకాల బిజినెస్ లు కూడా చేస్తూఉంటుంది. పెళ్లయిన 12 సంవత్సరాల కి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అపోలో ఆసుపత్రిలో జూన్ 20 ఉదయం 1:49 నిమిషాలకు ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక రెండు రోజుల క్రితమే తన కూతురు నామకరణ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేశారు. తన కూతురి పేరుని క్లింకారా అని పెట్టారు. అయితే ఉపాసన తరచు ఈషా ఫౌండేషన్… సద్గురు దగ్గరికి వెళ్తూ ఉంటారు ఉపాసన. అయితే ఈ ఫౌండేషన్ వద్దకు వచ్చే వారందరూ ప్రశాంతత కోసం, మనసుని ఉల్లాసంగా ఉంచుకోవడం కోసం వస్తారని… సద్గురు చెప్పే మాటలకు చాలామంది ప్రభావితం అవుతారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఉపాసన కుటుంబానికి సంబంధించిన ప్రతి వేడుకలో సద్గురు పాల్గొంటారు. తాజాగా ఉపాసనకి బిడ్డ జన్మించడంతో తనని చూసి ఆశీర్వదించడానికి సద్గురు అపోలో ఆసుపత్రికి వచ్చారు. పాపను చూసిన అనంతరం పాప మహత్జాతకురాలు అవుతుందని చిరంజీవి, సురేఖకు చెప్పి పాపను దీవించి సద్గురు వెళ్ళిపోయారట.