Friday, June 14, 2024

ప్రభుత్వ స్కూల్స్ బాగుపడేది ఎప్పుడు?

తప్పక చదవండి
  • ప్రశ్నించిన ఉచిత విద్య, వైద్య సాధన సమితి, అధ్యక్షులు నారగొని ప్రవీణ్ కుమార్..

ప్రభుత్వ పాఠశాలలలో యూనిఫామ్స్ లేవు, ఉన్నా సరైన సమయానికి అందవు. ఇచ్చే యూనిఫామ్స్ నాణ్యత అద్వాన్నంగా ఉంది. యూనిఫామ్స్ నెలరోజులలోనే చినిగిపోతున్నాయి. టెక్ట్స్ బుక్స్ ఇప్పటి వరకు అన్ని సెట్స్ ఇంకా స్కూల్స్ కి చేరలేదు. ప్రతీ సంవత్సరం పూర్తి స్థాయిలో పుస్తకాలు అందవు. తెలుగు బుక్స్ వస్తే ఇంగ్లీష్ బుక్స్ రావు. ఇంగ్లీష్ పుస్తకాలు వస్తే గణిత పుస్తకాలు రావు. ఇలా అయితే పిల్లలు ఎలా చదివేది. టీచర్స్ కి టి.ఎల్.ఎం. లేదు.. పిల్లలకు త్రాగు నీరు లేదు.
టాయిలెట్స్ లేవు.. కొన్ని స్కూల్స్ లో అవి ఉన్నా నీళ్లు రావు.. కడిగే స్కావెంజర్లు లేరు. తాత్కాలికంగా స్కావెంజర్స్ ను పెట్టుకున్నా వారికి ఇచ్చే డబ్బులు చాలా తక్కువగా ఉంటున్నాయి.. అవికూడా నెల నెలా ఇవ్వటం లేదు.. అందుకే ఎవరూ ముందుకు రావడంలేదు. ప్రైమరీ స్కూల్స్ లో అటెండెర్స్ లేరు.. స్వీపర్స్ లేరు. ఫలితంగా పరిశుభ్రత లోపిస్తుంది. పిల్లలు రోగాల పాలవుతున్నారు. రాష్ట్రంలో 90 శాతం మండలాలలో పూర్తిస్థాయి ఎంఈఓ లు లేరు. ఒక్కో ఇంచార్జి ఎంఈఓ సుమారు 6-7 మండలాల స్కూల్స్ ను చూడవలసి వస్తుంది. దీనివల్ల పర్యవేక్షణ అటకెక్కింది. స్కూల్ గ్రాంట్స్ కి నిధులు లేవు. వచ్చే స్కూల్ గ్రాంటు కరెంటు బిల్లులకు కూడా సరిపోవడంలేదు. ఇప్పకటికే అన్నివస్తులున్న కొన్ని స్కూల్ లని ఎంపిక చేసి, ఆ స్కూల్స్ కే రంగులు వేసి, బెంచీలు వేసి, మన ఊరు మన బడి క్రింద అన్ని స్కూల్స్ ని అభివృద్ధి చేసినట్టు ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికి 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీ.ఎస్.సి. వేయటం లేదు. రాష్ట్రం లో బీఈడీ చేసిన 7 లక్షల మంది నిరుద్యోగులు డీ.ఎస్.సి. కోసం 6 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఉపాధ్యాయులకు
బంగారు తెలంగాణ వచ్చాక పీఆర్సీ ఆలస్యం కావడం వల్ల 3 సం.వేతనాలు నష్టపోవడం జరిగింది. ఇప్పటికి పీఆర్సీ బకాయిలను 16 వాయిదాలలో ఇస్తామని ప్రకటించినా ఇప్పటివరకు 1 వాయిదా మాత్రమే చెల్లించారు. ఇప్పటికే మళ్ళీకొత్త పీఆర్సీ వేయాల్సి ఉన్నా ఆ దిశగా ఆలోచనకుడా చేయడం లేదు. ఇప్పటికి 4 డీఏలు (కరువు భత్యం) ఇవ్వాల్సి వున్నా ఒక్క డీఏ ఇస్తామని అదికూడా 16 వాయిదాలలో ఇస్తామని ప్రకటించడం విడ్డూరం.. 5 సంవత్సరాల క్రింద ప్రకటించిన పీఆర్సీ బకాయిలకే దిక్కులేదుగాని, డీఏ బకాయిలు 16 వాయిదాలలో ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉంది. పీఆర్సీ, డీఏలు, జీతాలు ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులు తాము తీసుకున్న లోన్లకు బ్యాంకు లో ఈ.ఎం.ఐ.లు కట్టలేక పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తెలంగాణాలో ఉద్యోగులకు 1 తారీకు జీతాలు లేక చాలా కాలం అయ్యింది. 10 నుండి 20 తారీకు వరకు జిల్లాల వారీగా రొటేషన్ పద్ధతిన జీతాలు పొందుతున్నారు. ఉద్యోగులు – ఉపాధ్యాయులకు ఎంప్లాయిమెంట్ హెల్త్ స్కీం ను ప్రయివేటు ఆసుపత్రులు తిరస్కరిస్తున్నాయి.. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే. ఉద్యోగులు నెలసరి చెందా కట్టేందుకు సిద్దమైన ప్రభుత్వం అదిశగా చర్యలు చేపట్టడం లేదు. కరోనా వల్ల ఎన్నో ఉపాధ్యాయ కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇక ప్రమోషన్లు లేక వేల మంది ఉపాధ్యాయులు ఒకే కేడర్ లో రిటైర్మెంట్ అయ్యే దుస్థితి ఉంది. ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేస్తూ, కార్పొరేట్ స్కూల్స్ కి పరోక్షంగా సహాయపడుతుంది. బంగారు తెలంగాణలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేయాలి.. ఎమ్మెల్యే, ఎంపీల పిల్లలు ప్రభుత్వ స్కూల్స్ లోనే కచ్చితంగా చదవాలనే చట్టం చేయాలి.. అప్పుడు మాత్రమే ప్రభుత్వ విద్య బాగుపడే అవకాశం ఉంటుంది.. భారతదేశంలో ఉద్యోగుల జీతాల విషయంలో తెలంగాణ 13 వ స్థానంలో ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు