Tuesday, May 7, 2024

ఖమ్మం నుంచే బీఆర్‌ఎస్‌ పతనం.

తప్పక చదవండి
  • తెలంగాణ పీపుల్‌ కోసమే భట్టి పీపుల్స్‌ మార్చ్‌
  • కేసీఆర్‌ అభివృద్ది భ్రమలను తొలగించాం..
  • పాదయాత్ర అంశాలే కాంగ్రెస్‌ మేనిఫెస్టోగా
  • ప్రజల కష్టాలను భట్టి దగ్గర నుంచి చూశారు
  • జులై 2న తెలంగాణ జన గర్జన సభకు రాహుల్‌ గాంధీ
  • సభకు ఆటకం కల్గిస్తే అడ్డుగోడలు కూల్చివేస్తాం ?
  • ఏర్పాట్లు అద్భుతం ఖమ్మంలో 10కి 10 సీట్లు ఖాయం
  • ఈసారి ఒంటికన్ను శివరాసన్‌ ను ఇంటికి పంపిస్తాం ?
  • ఖమ్మంకు రేణుక, భట్టి రెండు కళ్ళు, శీనన్న మూడవ కన్ను
  • భట్టి పాదయాత్రపై స్పందించిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి..

పాలేరు: కాంగ్రెస్‌ పార్టీ కోసమే భట్టి విక్రమార్క పాదయాత్రను పరిమితం చేయడం లేదని, నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేసేది గానే కాంగ్రెస్‌ పార్టీ చూస్తోందని, ఖచ్చితంగా ఈ పాదయాత్ర వల్ల పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుక అవసరమైన ఆలోచన చేసేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుందని పీసీసీ చీప్‌ రేవంత్‌ రెడ్డి ఉద్ఘాటించారు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంజిల్లాలోని తల్లంపాడు వద్ద పాదయాత్ర శిబిరంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఆయన భేటీ అయ్యారు. ఆయనతో పాటు ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌, మాజీ ఎంపీ మల్లురవి తదితరులు భట్టిని కలిసినవారిలో ఉన్నారు.ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర కాంగ్రెస్‌ పార్టీ కోసం చేసింది కాదని.. తెలంగాణ సమాజం కోసం చేసిందని అన్నారు. అభివృద్ధి పేరుతో కేసీఆర్‌ ఈస్ట్‌ మన్‌ కలర్‌ లో చూపిస్తున్న భ్రమల్ని ఈ పాదయాత్ర పటాపంచలు చేసిందని అన్నారు. భట్టి విక్రమార్క ఊరూరూ తిరుగుతూ అక్కడ జరుగుతున్న తప్పిదాలను, నష్టాలను, కేసీఆర్‌ చేతిలో మోసపోయిన బాధితులను భట్టి విక్రమార్క కలిసి.. వారికి భరోసా కల్పించారని అన్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ చేసిన అన్ని రకాల మోసాలను భట్టి విక్రమార్క ప్రజలకు వివరించుకుంటూ ముందుకు సాగారని చెప్పారు. భట్టి విక్రమార్క చేసిన పాదయాత్ర.. కాంగ్రెస్‌ పార్టీకన్నా.. మొత్తం తెలంగాణ సమాజానికి మేలు చేసే పాదయాత్రగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా అభివర్ణించారు. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర తెలంగాణ ప్రజల సమస్యలకు ఒక జవాబును వెతుకుతుంది. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో చూసిన సమస్యలు.. వాటి పరిష్కారమే.. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోగా ఉంటుందని రేవంత్‌ తెలిపారు.. తెలంగాణాలో చంద్రశేఖర్‌ రావు పాలనకు రోజులు దగ్గర పడ్డాయనీ, ఖమ్మం నుంచే బీఆర్‌ యస్‌ పతనం ప్రారంభం అవుతుందనీ పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ గార్డెన్‌ వెనుకాల ఉన్న 100 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అధికార పార్టీ సభకు ఆటంకాలు కల్పిస్తున్నట్లు తెలుస్తుందని సభను సభకు వచ్చెయ్‌ ప్రజలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సభను అడ్డుకుంటే గోడలనైనా కూల్చి వేస్తాం ?ఆటంకాలు కల్పిస్తే తొక్కేస్తాం అని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు .భట్టి విక్రమార్క 1300 కి.మీ యాత్ర చేసి స్ఫూర్తి నింపారని. మనం ఈ కొద్దీ దూరం నడవలేమా అని అన్నారు. వాళ్ళ ఆటంకాలను ప్రజలు గమనిస్తున్నారని వడ్డీతో సహా తీర్చుకుంటారని అన్నారు. గతంలోనే ఖమ్మం ప్రజలు 10 సీట్లకు ఒక్క సీటే బీఆర్‌ యస్‌ కు ఇచ్చారు. ఇప్పుడు ఉన్న ఒంటికన్ను శివరాసన్‌ కూడా గెలవడు..ఇంటికి పోవడం ఖాయం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బీఆర్‌ యస్‌ పాలనపై కేసీఆర్‌ విధానాలపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు .సభకు అధికార పార్టీ ఆటంకాలు కల్పించడం పై విమర్శలు గుప్పించారు . 15 వందల ఆర్టీసీ బస్సు లకోసం 2 కోట్ల రూపాయలు చెల్లించి తీసుకుంటామంటే ముందు సరే అన్న అధికారులు తర్వాత ప్రభుత్వ పెద్దల ఆదేశాలమేరకు ప్రధానంగా శాఖ మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్‌ ఇవ్వొద్దన్నాడని అధికారులు చెపుతున్నారని ధ్వజమెత్తారు. ఇదేనా ఆర్టీసీ కి లాభం చేసే పద్దతి ?మేము ఉచితంగా బస్సు లు తీసుకోవడంలేదు ?నష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకుందామని, సిబ్బందికి మేలు చేద్దామని అనుకుంటే వారు నిరాకరించడం విడ్డురంగా ఉందని అన్నారు జిల్లాకు పొంగులేటి మూడో కన్ను. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ లో ఒక కన్ను రేణుక చౌదరి అయితే మరో కన్ను సీఎల్పీ నేత భట్టి అని మూడు కన్ను పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అని రేవంత్‌ రెడ్డి అన్నారు. మూడవ కన్ను పవర్‌ ఎలా ఉంటుందో తెలుసుగా అని చమత్కరించారు ?జిల్లాలో ఎలాంటి విభేదాలు లేకుండా అందరు ఒక్కటై పని చేయాలనీ అందుకు ఏఐసీసీ కూడా పరిశీలకులను పంపుతుందని అన్నారు. సభ నిర్వహణ కోసం పొంగులేటి తోడుగా ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేతలు కాకుండా ఏఐసీసీ బృందం ఒకటి ఉంటుందని పేర్కొన్నారు. రేవంత్‌ వెంట ఏఐసీసీ పరిశీలకులు రోహిత్‌ చౌదరి, రాష్ట్ర నాయకులు మధు యాష్కీ, వి.హనుమంతరావు, సీతక్క, బలరాం నాయక్‌, పొదెం వీరయ్య, మహేష్‌ కుమార్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు