Saturday, May 4, 2024

ఢిల్లీ యూనివర్సిటీ ముగింపు ఉత్సవాలు..

తప్పక చదవండి
  • కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాని మోడీ..
  • మోడీ పర్యటన వేళ యూనివర్సిటీ పరిధిలో పలు ఆంక్షలు..
  • బ్లాక్‌ డ్రెస్‌ వేసుకోవద్దని ఆదేశాలు, విద్యార్థి సంఘాల నేతలు అరెస్ట్‌.

న్యూ ఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సావాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని వివిధ కాలేజీలు.. తమ విద్యార్థులు, ఉద్యోగులకు కీలక మార్గదర్శకాలు జారీ చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు ఎవరూ నల్ల రంగు దుస్తులు ధరించవద్దని యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలన్నీ మార్గదర్శకాలు జారీ చేశాయి. ఈ యూనివర్సిటీ ముగింపు కార్యక్రమంలో విద్యార్థులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆయా కళాశాలలు తమ నోటీసుల్లో పేర్కొన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్న ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమం లైవ్‌ స్ట్రీమింగ్‌కు విద్యార్థులు అందరూ హాజరు కావాలని పేర్కొన్నారు. యూనివర్సిటీలో ట్రాఫిక్‌, ఇతర అడ్డంకులు ఏర్పడకుండా ఉదయం 9 గంటల లోపే అందరూ కళశాలకు రావాలని ఆదేశించారు. ఎవరూ ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్‌ డ్రెన్‌లు వేసుకోవద్దని ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన హిందూ కాలేజ్‌ సహా యూనివర్సిటీ పరిధిలోని పలు కళాశాలలకు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రొఫెసర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌, విద్యార్థులు అందరూ కళాశాలలో జరుగుతున్న వర్చువల్‌ కార్యక్రమానికి హాజరుకావాలని డాక్టర్‌ భీమ్‌రావ్‌ కళాశాల ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇలా ఆంక్షలు పెట్టడం ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదం అయింది.
నోటీసులు ఏమీ జారీ చేయలేదన్న యూనివర్సిటీ యాజమాన్యం :
ప్రధాని పర్యటన వేళ యూనివర్సిటీ పరిధిలో ఆంక్షలు విధించారని వస్తున్న వార్తలపై ఆయా కళాశాలు స్పందించాయి. అలాంటి నోటీసులు ఏమీ జారీ చేయలేదని హిందూ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ అంజు శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ఇలాంటి ఆదేశాలపై తమకు ఏ విధమైన సమాచారం లేదని చెప్పారు. ఆంక్షలు, ఆదేశాలపై ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న పలు కళాశాలల యాజమాన్యాలు కూడా ప్రకటనలు విడుదల చేశాయి. ప్రధాని కార్యక్రమానికి హాజరు కావాలని మాత్రమే ఉద్యోగులు, విద్యార్థులకు సూచించామని.. అయితే అది తప్పనిసరి అని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని వెల్లడిరచాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు