Tuesday, May 28, 2024

ఖైరతాబాద్ లో నువ్వా.. నేనా..!

తప్పక చదవండి
  • మంత్రులను అందిస్తున్న ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం..
  • ఇక్కడ గెలిస్తే మంత్రి పదవి ఖాయమా..?
  • గతంలో ఇక్కడ గెలిచిన వారంతా మంత్రులుగా చక్రం తిప్పినోళ్లే..
  • ఇక్కడ నుండి నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న నేతలు
  • దానంకు టికెట్ రాదంటూ ఊపందుకున్న ప్రచారం..
  • బీఆర్ఎస్, కాంగ్రేస్, బీజేపీ, టీడీపీ నుంచి ఇద్దరికి పైగా అభ్యర్థులు
  • దానం నాగేందర్ ఫై తారాస్థాయికి చేరిన అసమ్మతి..
  • ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానంఫై చక్రం తిప్పుతున్న కీలకనేతల వారసులు..

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి అతి పెద్ద నియోజకవర్గంగా పేరుండేది. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుగా విడిపోయింది. ఖైరతాబాద్ తో పాటు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ గా ఈ నియోజకవర్గాన్ని విభజించారు. అయితే ఖైరతాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పి.జనార్ధన్ రెడ్డి ఐదు దఫాలుగా విజయం సాధించి అప్పటి కాంగ్రేసులో సీనియర్ నేతగా అప్పటి ప్రభుత్వంలో చక్రం తిప్పారు.. అయన మరణానంతరం 2009లో దానం నాగేందర్ 50, 655 ఓట్లతో గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో ఈ స్థానం నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి 53,102 ఓట్లతో విజయం సాధించగా. 2018లో జరిగిన ఎన్నికల్లో అయన టీఆర్ఎస్ అభ్యర్ధి మాజీ మంత్రి దానం నాగేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను గెలిస్తే మంత్రి పదవి ఖాయమన్న సెంటిమెంట్ తో ప్రచారం చేసుకుని గెలిచిన మాజీ మంత్రి బీ.ఆర్.ఎస్. అభ్యర్ధి దానం నాగేందర్ 63,068 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గంలో తన పట్టును పూర్తిగా కోల్పోయారు. ఆయనఫై పలు ఆరోపణలు, విమర్శలు స్వంత పార్టీ నేతలే ప్రచారం చేయడం దానంకు మింగుడుపడని వ్యవహారంలా తయారయ్యింది. దీంతో ఈ సారి ఖైరతాబాద్ అభ్యర్థి ఎవరన్నదానిపై చర్చ జరుగుతోంది..

దానంపై ఉన్న అసమ్మతి కారణంగా ఆయనకు నో ఛాన్స్ :
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కంటే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానిది ఓ ప్రత్యేకమైన స్థానంగా చెపుకోవచ్చు. ఇక్కడ మంత్రులు, ప్రముఖులు, ఉద్యోగులు, సినీ ప్రముఖులతో పాటు బీసీలు, మధ్యతరగతి వర్గాలు, మురికివాడల ప్రజలు నాయకుల గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేస్తారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల కాలనీలు, సెటిలర్లు, సినీ వర్గాలు, మురికివాడలను టార్గెట్‌ చేసుకుని నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటారు. గతంలో గెలిచిన దానం మంత్రిగా ఉండగా తాను చేసిన అభివృద్ధి, కేసీఆర్‌ చరిష్మా గెలిపించాయని అనుకున్నా.. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత, దానంపై ఉన్న అసమ్మతి ఆయనను టికెట్ రేసునుంచే తప్పించే పరిస్థితులు కనబడుతున్నాయి. కాంగ్రెస్ కు కంచుకోటలా ఉండి 5 సార్లు గెలుపించుకున్న ఖైరతాబాద్ ఇప్పుడు అదే కాంగ్రేసు అభ్యర్థికి పట్టం కడతాయంటూ ప్రచారం ఉంది.

- Advertisement -

దానంకు ప్రత్యమ్నాయంగా ఎవరు..?
గతంలో బీ.ఆర్.ఎస్. టికెట్టు ఆశించి భంగపడ్డ మన్నె గోవర్ధన్ రెడ్డి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి ఆయనకే బీ.ఆర్.ఎస్. టికెట్ వస్తుందన్న ఊహగానాలు వినబడుతున్నాయి. గతంలో బీ.ఆర్.ఎస్. ఖైరతాబాద్ సీటుపై ఆ పార్టీలో దుమారం రేగింది. ఈ టికెట్ మన్నె గోవర్ధన్ రెడ్డికే కేటాయించాలంటూ అనుచరులు ఆందోళనకు దిగారు. మన్నె అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ ముందు ధర్నాకు దిగారు. మన్నెకు టికెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. తెలంగాణ భవన్ ముందు బైఠాయించడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వారికి సర్ధిచెప్పారు.

కాంగ్రేస్ నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు :
కాంగ్రేస్ నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఐదు దఫాలుగా విజయం సాధించిన పి. జనార్ధన్ రెడ్డి కూతురు విజయారెడ్డి ఉన్నారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌కు టికెట్ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుండి.. ఈ నిర్ణయాన్ని రోహిన్ రెడ్డి, మధుకర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ లు తీవ్రంగా వ్యతిరేకించారు. వీరితో ఉత్తమ్ సమావేశమయ్యి అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకోవాలని సూచించారు. ఇప్పుడు వీరూ టికెట్ రేసులో ఉన్నారు.

బీజేపీ నుంచి ఎవరంటే ..?
టీడీపీ ఈసారి బీజేపీతో కలిసి పోటీ చేస్తాయన్న నేపథ్యంలో సెటిలర్ల ఓట్లకు గండి పడుతుందని బీ.ఆర్.ఎస్. ఆందోళన చెందుతోంది. 2014లో బీజేపీ ఎమ్మేల్యేగా చింతల రామచంద్రారెడ్డి గెలుపొందినప్పటికీ 2018లో ఆయన ఓటమి పాలయ్యారు. పార్టీలో ప్రస్తుతం ఆయన సీనియర్ నేతగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో
ఓటమిని చవి చూడటంతో ఈసారి తనకే టిక్కె ట్టు దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. కానీ, ఆయన వయసు 70 ఏండ్లు పైబడటంతో అధిష్టానం యువతకు కొత్త నేతల వైపు దృష్టి మళ్లిస్తోం దని తెలుస్తోంది. నియోజకవర్గన్ని అంటిపెట్టుకొని ఉండే బి.సి. ఒడ్డెర సామాజిక వర్గానికి చెందిన పల్లపు గోవర్ధన్‌కే టికెట్ కలిసొచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు అధికార బీ.ఆర్.ఎస్. ను ఎదుర్కొ నే సత్తా గోవర్థన్‌లోనే ఉందని టాక్ వినిపిస్తోం ది. దాంతోపాటు కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కూడా ఆయనకు పేరుంది. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో ఎన్నో నిరసనలు, ధర్నాలు గోవర్ధన్‌ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములను ఇరవై సంవత్స రాలకు లీజ్‌కు తీసుకున్న బడా సంస్థలు రూ. 271 కోట్లతో ప్రభుత్వానికి రావాల్సి న ఖజానా గండి కొడుతున్నారని తెలిసి ఐమాక్స్ వద్ద పెద్ద ఎత్తున్న ధర్నా చేపడితే స్నోవరల్డ్ మూత పడింది. ప్రభుత్వా నికి రూ. 271 కోట్లు వసూలు జరిగాయి. గణేష్ నిమజ్జనంపై ఆంక్షలకు నిరసనగా ఫిల్మ్ నగర్ లో నిరసనలు, ధర్నా చేపట్టారు. ఫిల్మ్ నగర్ లోని 50 ఏళ్లుగా పూజలందుకుంటున్నఆంజనేయ స్వామి దేవాలయాన్ని తొలగించేందుకు చూసిన అధికారులకు అడ్డుపడి నిరసనలు, ధర్నాలు చేసినందుకు ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన నిర్వహించిన పలు కార్యక్రమల్లో వేల సంఖ్యలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు.

టీటీడీపీ నుంచి ఎవరంటే..:
తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు అరవిందకుమార్ గౌడ్ పోటీచేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ముక్కుసూటిగా తాను చేయగలిగే పనులను మాత్రమే చెప్పి, నియోజకవర్గ ప్రజలను మెప్పించేగలిగే సత్తా ఉన్న నాయకుడిగా, స్థానికుడిగా అరవిందకుమార్ గౌడ్ కు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. బీజేపీ.. టీడీపీతో కలిసి వస్తే అయన గెలుపు నల్లేరుపై నడకలాంటిదే అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ప్రజాకేత్రంలో ఆయనకు ప్రత్యర్థులు ఎవరూ లేరని.. నియోజవర్గంలోని ప్రజలు అభిప్రాయం.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం.. లేని భ్రమలు కల్పించకపోవడం.. అయన ప్లస్ గా చెప్పుకుంటారు స్థానిక నేతలు. ఒకవేళ ఆయన టికెట్ నిరాకరిస్తే మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ నాయుడు పోటీచేసే అవకాశం ఉంది.. ప్రస్తుతం ఆయన భార్య కార్పొరేటర్ గా కొనసాగుతున్నారు. శ్రీనివాస్ నాయుడికి సౌమ్యుడిగా మంచి పేరుంది. బూత్ స్థాయి నుంచి నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టుంది. సీనియర్ నాయకులు అరవిందకుమార్ గౌడ్ సీటును నిరాకరిస్తే ఆయన శిష్యుడిగా పేరున్న ఈయనకే టీటీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చే అవకాశంగా కనిపిస్తుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు