Sunday, May 12, 2024

టీ కాంగ్రెస్‌లో పార్టీ పదవుల లొల్లి..

తప్పక చదవండి
  • కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి హెచ్చరిక..
  • గాంధీ భవన్‌లో ఆందోళన చేస్తే సస్పెండ్ చేస్తామని వార్నింగ్..

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీకాంగ్రెస్‌లో పార్టీ పదవులు అగ్గి రాజేస్తున్నాయి. పార్టీ పదవుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ గత కొన్ని రోజులుగా పలువురు నేతలు గాంధీభవన్‌కు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు, కాంగ్రెస్ తిరిగి బలం పుంజుకుంటున్న సమయంలో పార్టీ నేతల అంతర్గతపోరు టీపీసీసీకి కొత్త తలనొప్పిగా తయారైంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గాంధీ భవన్‌లో ఆందోళలు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గాంధీ భవన్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డికి ఆలేరు నియోవజర్గం తురకపల్లికి చెందిన కొందరు నేతలు ఆందోళన చేస్తూ కనిపించారు. ఆందోళనకు గల వివరాలు తెలుసుకున్న రేవంత్ తీవ్రంగా స్పందించారు. ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాలకుగాను 7 మండలాల అధ్యక్షులను నియోజకవర్గ ఇంఛార్జి బీర్ల ఐలయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి అనుకూలంగా ఉన్నవారినే నియమించామని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. ఒక్క మండలానికి మహిళను అధ్యక్షురాలని చేస్తే.. వ్యతిరేకించటమేంటని ఆయన ప్రశ్నించారు. ఇలా ఆందోళనలు చేయటం సరికాదని.. తక్షణమే ఆందోళన విరమించకుంటే సస్పెండ్ చేసేందుకు వెనకాడబోనని అన్నారు. ఈ మేరకు వివరాలు సేకరించాలని గాంధీభవన్ ఇంఛార్జి, పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్ రావును రేవంత్ ఆదేశించారు. అలాగే మొన్నటి వరకు మండల కమిటీ ప్రెసిడెంట్‌గా ఉన్న శంకర్ నాయక్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. గాంధీ భవన్ మెట్లపై ఇకమీదట ఎవరు ఆందోళనలు చేయకూడదని.., ధర్నాలు చేస్తే సస్పెండ్‌లే ఉంటాయని హెచ్చరించారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు చిన్నారెడ్డికి రేవంత్‌ రెడ్డి సూచించారు. అయితే.. కమిటీల నియామకంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే గనుక పార్టీ ఆర్గనైజింగ్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వేమ నరేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఆ వినతులపై పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. ఎన్నికల సమీస్తున్న తరుణంలో పార్టీకి నష్టం కలిగేలా ఎవరూ వ్యవహరించకూడదని అన్నారు. కలిసికట్టుగా పనిచేసి పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు