Sunday, May 19, 2024

హైదరాబాద్‌కుకేసీిఆర్‌ చేసిందేమీ లేదు

తప్పక చదవండి
  • ఎంఐఎం చెప్పగానే మెట్రోపై హడావుడి
  • 9ఏళ్లుగా ఏం చేస్తున్నారన్న చింతల

హైదరాబాద్ : అభివృద్ధి కోసం కేసీఆర్‌ సర్కార్‌ చేసిందేవిూ లేదని బీజేపీ సీనియర్‌ నేత, ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. రెండు సెంటీవిూటర్ల వర్షానికే హైదరాబాద్‌ మునిగిపోతోందన్నారు. లక్షకోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఎందుకు సిటీ దుస్థితి మారలేదని ప్రశ్నించారు. ఎన్నో గొప్పలు చెప్పుకునే కేటీఆర్‌ నగరంలో ఎస్టీపీలు ఎందుకు నిర్మాణం చేయలేదని నిలదీశారు. దేశంలో మిగతా నగరాలతో పోల్చితే జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ తక్కువగా ఉంటుందన్నారు. ఎంఐఎం చెప్పగానే మెట్రో పనులు మొదలు పెట్టాలంటున్నారని.. తొమ్మిది సంవత్సరాల పాటు ఏం చేశారని అడిగారు. ప్రతి ఇంటికి త్రాగు నీరు ఇస్తామని ఇవ్వలేదన్నారు. మూసి రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు ఏమైందని.. గోదావరి నీటితో నింపుతా అన్నారు ఏమైందని ప్రశ్నలు గుప్పించారు. గోదావరి నీటితో ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లను నింపుతా అన్నారు ఏమైందని అడిగారు. అమృత్‌, హెరిటేజ్‌ సిటీల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. కేటీఆర్‌ బిల్డర్‌లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయారని విమర్శించారు. కేశవపురంలో కడుతామన్న రిజర్వాయర్‌ ఏమైందన్నారు. కేటీఆర్‌ చెప్పేవన్నీ బూటకపు మాటలే అని.. కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా దిగమింగుతున్నారని ఆరోపించారు. అవినీతి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గ్దదె దించాలని .. బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. కే ట్యాక్స్‌ పేరుతో 30శాతం కవిూషన్‌ తీసుకుంటున్నారని.. యూసీసీని ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేస్తామని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనంకంటే దేశ బాగు కోసం ఆలోచించే పార్టీ బీజేపీ అని చింతల రామచంద్రారెడ్డి వెల్లడిరచారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు