Sunday, April 21, 2024

జల్‌పల్లి కమిషనర్ ‘‘జరా దేఖో ఇదర్‌’’..!

తప్పక చదవండి
  • సంవత్సరాలుగా తీరని మురుగు సమస్య…!
  • సీజనల్‌ వ్యాధులతో విషజ్వరాల వ్యాప్తి…..!!
    జల్‌పల్లి : పురపాలక సంఘం ఒకటవ వార్డు ఉమర్‌ ఫారూఖ్‌ మస్జిద్‌ ఎదురుగ ఉన్న బస్తిలో అనేక చోట్ల మురికి కాలువలు సరిగా లేక ప్రధాన రహదారి తోపాటు పలు కాలనీలోని అంతర్గత రోడ్లపై మురుగు నీరు ఏరులై పారుతు కంపు కొడుతోంది. ఇలా ఉన్నప్పటికీ పాలకవర్గం మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2013వ సంవత్సరంలో రూ. 5 లక్షల గ్రామపంచాయతీ నిధులతో ఆరు ఇంచుల అంతర్గత పైప్‌ లైన్‌ లతో చేపట్టిన నిర్మాణ మురికి కాలువలు ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల వార్డులో మురికినీరు రోడ్లపైకి ఇండ్ల మధ్యలో నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతుంది. వర్షాకా లంలో మరింతగా ఉధృతంగా ఉంటుంది. ప్రస్తుతం డెంగ్యు, మలేరియా లాంటి విషజ్వరాలు, సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న మున్సిపల్‌ అధికారులు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని, జల్‌పల్లి మున్సిపాలిటీ 2016 వ సంవత్సరంలో ఏర్పడిన తరువాత 1వ వార్డులో ప్రజల సమస్యలు తీరేలా అభివృద్ధి పనులు జరగలేదని, మా కాలనీలో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి వర్ష కాలంలో మురుగు సమస్యతో రోడ్డుపై నడవలేని విధంగా డ్రయినేజి నీరు బయటకు వస్తుంది, రహదారి తోపాటు పలువురి ఇండ్ల చుట్టూ ఉండిపోవడంతో రోగాలు వచ్చే అవకాశం ఉంది. 1వ వార్డును అభివృద్ధి పరుస్తానని స్థానిక కౌన్సిలర్‌ గెలిచి నేటికీ మూడు సంవత్సరాలు కావస్తున్నా చాల వరకు హామీలు నెరవేర్చలేదని, పలు బస్తీలలో మురుగు సమస్యను శాస్వితంగా పరిస్కారం అయ్యేలా మున్సిపల్‌ కమిషనర్‌, సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైయ్యాడని స్థానిక యువకుడు అబ్దుల్‌ గఫ్ఫార్‌ ఆరోపించారు. ఇన్ని సమస్యలలో ఉన్న మా కాలనీ కష్టాలు మేము ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గం ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి దృష్టికి రాలేదా? జల్‌పల్లి పురపాలక సంఘంలో కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనకు, ప్రారంభోత్సవాలకు విచ్చేస్తున్న మంత్రి తమ వార్డులో ఒక్కసారి సందర్శించి మురుగు సమస్యతో విముక్తి కలిగేలా శాస్విత పరిష్కర మార్గం చేపట్టాలని స్థానికులు కోరారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు