Tuesday, March 5, 2024

అనుమతులు లేని వెంచర్‌ రెడీ..

తప్పక చదవండి
 • ప్లాట్లుగా చేసి అమాయక ప్రజలకు అంటగడుతున్న వైనం..
 • డిటిసిపి, నాల అనుమతి లేకుండానే వెంచర్‌ డెవలప్మెంట్‌..
 • వెంచర్‌ డెవలప్‌ చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు..?
 • గ్రామ కార్యదర్శి, సర్పంచ్‌ కనుసన్నలలోనే వెంచర్‌ ఏర్పాటు జరిగిందా..?
  చివ్వెంల : అక్రమ వెంచర్‌ లకు కేరాఫ్‌ అడ్రస్‌గా చివ్వెంల మండలం కేంద్ర బిందువుగా మారింది. మండల పరిధిలో జాతీయ రహదారి (365 బిబి) రోడ్డు నిర్మాణ జరగడంతో రహదారి పక్కనే ఉన్న భూములకు అమాంతం ధరలు పెరిగి మంచి రేటు పలుకుతుంది.ఇదే అదనగా భావించిన రియాల్టర్లు యదేచ్చగా సాధారణ రైతుల భూములను కొనుగోలు చేసి, అనుమతులు తీసుకోకుండానే అధికారుల అండదండలతో కోట్లు సంపాదిస్తున్నారు. చివ్వెంల మండల పరిధిలోని అక్కలదేవి గూడెం, ఐలాపురం, గుంజలూరు, కుడ కుడ, బిబి గూడెం, గాయవారిగూడెంలలో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుళ్ల రోజురోజుకు పెరుగుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు, గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు అక్రమ వెంచర్లను వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు భహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. నియమ నిబంధనలు పాటించకున్న, అక్రమ వెంచర్‌ కి అన్నీ అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు కొందరు కార్యదర్శులు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొందరు అమాయక రైతుల దగ్గర తక్కువ ధరకే భూములు కొను గోలు చేసి, ఎలాంటి అనుమతులు పోందకుండనే,ఆ స్థలాన్ని చదును చేసి, ప్లాట్లుగా మార్చి,హద్దు రాళ్ళను పాతి ప్రజలకు మాయమాటలు చెప్పి ప్లాట్లను అంటగడుతున్నరు. సంబంధిత గ్రామ కార్యదర్శి గాని అధికారులు కానీ, ఆ వెంచర్‌ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం.వెంచర్‌ పై ఫిర్యాదులు వస్తే, అన్ని అనుమతులు ఉన్నాయని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కొంతమంది రియాల్టర్లు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి వాటిని వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేయకుండానే, వెంచర్ల ఏర్పాటు చేసి దజ్జాగా ఫ్లాట్లు గా మార్చి విక్రయిస్తున్నారు.
  పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ కనుసన్నల్లో వెంచర్‌ అభివృద్ధి..
  అక్కల దేవి గూడెం గ్రామ పరిధిలోనీ సర్వే నెంబర్‌ : 40/3/1 – 1.1000, 40/2/1/2 – 0.2200, 40/1/2 – 1.3050 , 41/ఇ 2/1/3/1 – 0.0600 మొత్తం – 3.2850 కాగా, మరొక సర్వే నంబర్‌ లో 40/1/1 – 1.2050 ,40/2/1/1 – 0.2700, 40/3/2 -1.1000 మొత్తం 3.2750 రెండు కలిపి (ఎకరాలు) 6.5600 వ్యవసాయ భూమిని వెంచర్‌ గా మార్చారు.రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఏర్పాటు చేసిన హద్దురాళ్లు, ప్రహరీ గోడల నిర్మాణం చేసి ప్లాట్లను విక్రయిస్తుండగా ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు పొందలేదని,గత నెల లో దరఖాస్తు చేసుకోగా అనుమతులు రాలేదని గ్రామ కార్యదర్శి మల్లయ్య తెలిపారు.అధికారులను మచ్చిగా చేసుకుంటే గ్రామపంచాయతీ పరిధిలో ఏదైనా చేయవచ్చు అనేదానికి ఈ వెంచర్‌ అభివృద్ధి ఒక నిర్వచనం అని గ్రామస్తులు అభిప్రాయ పడుతున్నారు. వెంచర్‌ నిర్వాహకుడు తనకు నచ్చిన రీతిలో వెంచర్‌ నీ ఏర్పాటు చేసుకోగా, డిటిసిపి,నాల అనుమతి రాక ముందే 80 శాతం అభివృద్ధి చేశారు నిర్వాహకులు.వెంచర్‌ అభి వృద్ధి కంటే ముందే అన్ని అనుమతులు పొందక, గ్రామపం చాయతీకి పది శాతం భూమిని కేటాయించి,తదుపరి వెంచర్‌ అభివృద్ధి చేయాలి,కానీ ఈ మండలం లో ముందు వెంచర్‌ అభి వృద్ధి ఆ తరువాతే అనుమతులు అనే సంప్రదాయం నడుస్తుంది.
  మండల పంచాయితీ అధికారి టి.గోపి వివరణ :
  అక్కల దేవిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో వెంచర్‌కి అనుమతులు రాకముందే వెచర్‌ నీ డౌలప్‌ చేశారు. అల చేయవద్దని, ముందుగా డిటిపిసి, నాల అనుమతులు తీసు కోవాలి. ఆ తరువాత వెంచర్‌ అభి వృద్ధి చేసుకోవాలన్నారు. అనుమ తులు రాకముందే వెంచర్‌ డెవలప్‌ చేస్తే దాన్ని అక్రమ వెంచర్‌ పరిగణం లోకి వస్తుందన్నారు. మండల పరిధి లో ఉన్న అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు