Tuesday, April 23, 2024

రాష్ట్రపతికి ఇచ్చే విలువ ఇదేనా..?

తప్పక చదవండి
  • పార్లమెంట్‌ ప్రారంభంలో రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం పంపకపోవడం దుర్మార్గం..
  • తీవ్ర విమర్శలు చేసిన జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే

న్యూ ఢిల్లీ : నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును, ఆమెకు ముందు రాష్ట్రపతిగా వ్యవహరించిన రామ్‌నాథ్‌ కోవింద్‌లను ఆహ్వానించలేదని.. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లి కార్జున్‌ ఖర్గే విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్ధలను అగౌరవపరు స్తోంద ని, రాష్ట్రపతి కార్యాలయాన్ని లాంఛనప్రాయం చేసిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 28న నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభిస్తారని లోక్‌సభ సెక్రటేరియట్‌ తెలిపింది. ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసమే మోదీ ప్రభుత్వం దళిత, గిరిజన వర్గాల నుంచి రాష్ట్రపతులను ఎన్నికయ్యేలా చూసినట్టు కనిపిస్తోందని ఖర్గే దుయ్యబట్టారు. పార్లమెంట్‌ దేశ అత్యున్నత శాసన వ్యవస్ధని, రాష్ట్రపతి ప్రభుత్వంతో పాటు విపక్షం, దేశ పౌరులందరి ప్రతినిధి అని ఖర్గే ట్వీట్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు