Saturday, July 27, 2024

ఢిల్లీ ఆర్డినెన్స్‌పై సుప్రీంలో విచారణ

తప్పక చదవండి
  • 20వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం
    న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ అధికారాలను గుప్పిట్లో పెట్టుకునేలా తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ ఆప్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. ఆర్డినెన్స్‌ రాజ్యాంగ బద్ధతపై కేజీవ్రాల్‌ సర్కారు పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్‌ రాజ్యాంగ ధర్మాసనానికి సూచించనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంటూ.. వాదనలు వినేందుకు కేసు విచారణను
    ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఢిల్లీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఫ్వీు కోర్టు ధర్మాసనం సూచనలను వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహత వాదనలు వినిపించారు. మరోవైపు డీఈఆర్‌సీ (ఢిల్లీ ఎలక్టిస్రిటీ రెగ్యులేటరీ కమిషన్‌) విషయంలో ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ), ముఖ్యమంత్రి కలిసి కూర్చుని డీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌ పేరుపై నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
    20వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు