Saturday, April 27, 2024

ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ నూతన చైర్మన్ గా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి..

తప్పక చదవండి
  • ఐఎస్బిసి చీఫ్ ప్యాట్రన్ గా బీజేపీ ఎంపీ లక్ష్మణ్..
  • ఇప్పటికే ఐ.ఎస్.బీ.ఎఫ్.సి.కి జాయింట్ సెక్రెటరీ గా రాజమౌళి కుమారుడు కార్తికేయ..
  • నేను క్రికెట్ ఆడుతాను.. నాకు క్రికెట్ అంటే ఇష్టం..
  • ఏలూరులో కాలేజీ డేస్ లో క్రికెట్ టీంలో నేను ఒక్కడిగా ఆడేవాడ్ని..
  • రూరల్ ప్లేసెస్ లో చాలా టాలెంట్ ఉంటుంది.. కానీ సరైన ప్లాట్ ఫామ్ ఉండదు..
  • ఐ.ఎస్.బీ.సి. నన్ను అప్రోచ్ అయి.. రూరల్ క్రికెట్ కోసం పని చేస్తున్నాం అనగానే ఓకే చెప్పాను..
  • జనవరిలో స్కూల్స్‌ క్రికెట్ ప్రపంచకప్‌ నిర్వహణ..

భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి స్కూల్‌ క్రికెట్ బలోపేతానికి ముందుకొచ్చారు. స్కూల్‌ స్థాయి నుంచే అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేసేందుకు ఇండియన్‌ స్కూల్స్‌ బోర్డ్‌‌ ఫర్‌ క్రికెట్‌ (ఐఎస్‌బిసి) మూడంచెల పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో భారత్‌ వేదికగా స్కూల్స్‌ క్రికెట్‌ ప్రపంచకప్‌ జరుగనుండగా.. ఇండియన్‌ స్కూల్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ క్రికెట్‌ గౌరవ చైర్మెన్‌గా ‌ఎస్‌ రాజమౌళి ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఐఎస్‌బిసి ఫౌండర్‌ సీఈవో సునీల్‌బాబు కొలనుపాక వెల్లడించారు.

జనవరిలో స్కూల్స్‌ ప్రపంచ కప్‌ :
2024 జనవరిలో స్కూల్స్‌ క్రికెట్‌ ప్రపంచకప్‌ నిర్వహించనున్నారు. ఈ ప్రపంచకప్‌లో ఎనిమిది దేశాలు పోటీపడనున్నాయి. అంతకముందు, ప్రాజెక్ట్‌ స్కూల్‌ వరల్డ్‌కప్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 766 జిల్లాల్లో ఇంటర్‌ డిస్ర్టిక్‌, ఇంటర్‌ స్టేట్‌, ఇండియన్‌ స్కూల్‌ టాలెంట్‌ లీగ్‌ (ఐఎస్‌టీఎల్‌) నిర్వహిస్తారు. ఇండియన్‌ స్కూల్‌ టాలెంట్‌ లీగ్‌లో ఎనిమిది ప్రాంఛైజీలు ఆడతాయి. ఈ లీగ్‌లో విజేతగా నిలిచిన జట్టు స్కూల్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనుంది.

- Advertisement -

మెగా టాలెంట్‌ హంట్‌ :
ఇక ఇండియన్‌ స్కూల్‌ టాలెంట్‌ లీగ్‌, ప్రాజెక్ట్‌ స్కూల్ వరల్డ్‌కప్‌లో భాగమయ్యేందుకు ఐస్‌బిసి.. మెగా టాలెంట్‌ హంట్‌కు సిద్ధమైంది. 12-16 ఏండ్ల యువ క్రికెటర్లు తమ బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలతో కూడిన 60 సెకండ్ల నిడివి గల వీడియోను ఐఎస్‌బిసి వెబ్‌సైట్‌ లేదా ఐఎస్‌బిసి యాప్‌లో పోస్ట్‌ చేయాలి. ఐఎస్‌బిసి చీఫ్‌ మెంటార్‌ దిలిప్‌ వెంగ్‌సర్కార్‌ సారథ్యంలోని నిపుణులు వీడియోలను పరిశీలించి ప్రతి జిల్లా నుంచి 400 మంది క్రికెటర్లను ఎంపిక చేయనున్నారు. ఈ విధంగా ఎంపికైన 400 మంది వర్థమాన క్రికెటర్లు జిల్లా స్థాయి స్కూల్‌ క్రికెట్‌ లీగ్‌లో పోటీపడేందుకు అర్హత సాధిస్తారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు