Tuesday, May 21, 2024

వివాహబంధాలు.. జ్యోతిష్య, వాస్తు కారణాలు..

తప్పక చదవండి

వివాహ సంబంధాలపై జ్యోతిష్య, వాస్తు ప్రభావం..
( శ్రీ రుద్రపీఠం.. దేవముని దేవదైవజ్ఞ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం.. )

ఆకాశంలో నిశ్చయమై భూలోకంలో ఫలితములనిచ్చి ఏడడుగులు నడిపించి ,ఏడేడు జన్మల వరకు స్థిరంగా ఉండేలాచేసే వివాహ బంధాలు, అనుబంధాలు పసుపు పారాణి తుడుచుక పోకముందే మనస్సు విఖలమై తెగి విడాకులవరకు వస్తున్నాయంటే దానికి వాస్తు, జ్యోతిష్యకారణాలు ఏమైనా ఉన్నాయా అంటే కచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి.

- Advertisement -

యవ్వనములోకి అడుగుపెట్టిన ప్రతి యువతియువకులు ఎన్నో ఆశలతో ఎన్నెన్నో కళలుకని ఎంతో చక్కని అందమైన జీవితభాగ స్వామిని పొందాలని కనినకలలు ఒక్కసారిగా చెరిగిపోయేసరికి ఏమి చేయాలో తెలియక జీవితంపై విరక్తి చెంది అనర్థాలకు పాల్పడు తుంటారు.

జీవితభాగస్వామిని ఎంచుకునే ముందు అమ్మాయయినా లేక అబ్బాయయినా తమ నామాక్షరము గల రాశి నుండి 4వ స్థానం లేదా 9వస్థానం లేదా 11వ స్థానం లో గల వారిని పెండ్లి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకనగా 4వ స్థానం మాతృస్థానం,4వ స్థానం లోని వారిని పెండ్లి చేసుకొనినట్లయితే వారు తమ పార్టనర్ ని తల్లిలా చూసుకుంటారు. జీవితంలో ఎన్ని సార్లు ఎన్ని విధములైన కొట్లాటలు వచ్చినను పొట్లాడుకోవడం వరకు మాత్రమే ఉంటారు కానీ విడిపోవడం మాత్రం జరగదు. అదే ఏ 2వ,6వ,7వ,8వ స్థానమో లేక వ్యయ స్థానమో అయితే విడిపోవడమో లేక ఒకరినొకరు చూసుకోక పోవడమో జరుగుతూ ఉంటుంది.ఇలా కాకుండా భాగ్యస్థానంలోని వారిని పెండ్లి చేసుకొనినట్లయితే అదృష్టం కలిసి వస్తుంది మరియు లాభస్థానంలో గల వారిని పెండ్లి చేసుకొని నట్లయితే లాభం చేకూరుతుంది.
కేవలం ఈ స్థానబలములనే చూసుకోకుండా ముఖ్యముగా అగ్నితత్వ, భూతత్వ, వాయుతత్వ, జలతత్వములను, వీటితోపాటు మిత్రశత్రువులు అనగా శని అధిపతి గల రాశులైన మఖర,కుంభరాశులవారిని శనికి శత్రువులైన రవి, చంద్ర, కుజ గ్రహములు అధిపతులుగాగల రాశుల వారికి ఇచ్చి ఎట్టి పరిస్థితిలోను పెండ్లి చేయకూడదు.

ఇంతే కాకుండా వధువరులిద్దరికీ అనుకూలమైన సుముహూర్తము లను చూసి పెండ్లి చేసిన అనగా శని అధిపతిగాగల రాశులైన మఖర, కుంభ రాశులవారి పెండ్లి ఎప్పటికి ఆదివారంనాడు కానీ, సోమవారం నాడు కానీ, మంగళవారంనాడు కానీ మేష, సింహ, కర్కాటక లగ్నములలో కూడా చేయనేచేయ కూడదు. ఇలాగ ఎన్నో జాగ్రత్తలు తీసుకోని చేసిన పెండ్లిండ్లు పది కాలాల పాటు స్థిరంగా ఉండడమే కాకుండా పది మందికి ఆదర్శంగా ఉంటుంది. వివాహమునకు వాస్తు కారణములు ఏవనగా వివాహము కావలసిన వారు ఎప్పుడు ఇంటియందలి నైరుతిదిశగల రూంలో నైరుతిలో పడుకోకూడదు. ఇలా పడుకొని నట్లయితే వివాహంలో చాలా చాలా ఆలస్యం అవుతుంది. నైరుతి దిశగల రూమ్ లో వాయవ్యదిశలో పడుకొనినట్లయితే అమ్మాయి వివాహవిషయంలో సరైన నిర్ణయం తీసుకోని చక్కటి వరునిని ఎన్ను కుంటుంది. ఇంట్లోని వాయవ్య దిశలో అమ్మాయిని పడుకోపెట్టి నట్లయితే అమ్మాయి వివాహ విషయంలో సరియైన నిర్ణయం తీసుకోలేకపోతుంది ఇంట్లో నుండి లేచి పోతుంది లేదా తొందరగా పెండ్లి చేయవలసిన పరిస్థితి ఏర్పడు తుంది లేదా సంబంధవిషయంలో సరైన నిర్ణయం కుదరక తొందరగా సంబంధం కుదిరి వివాహమైనా జరుగుతుంది.
అమ్మాయి ఫోటోగాని లేదా అమ్మాయితో కూడిన ఫ్యామిలీ ఫోటోగాని ఇంటియందలి ఈ.ఎన్.ఈ. ( ENE ) దిశలో ఉన్నట్లయితే అమ్మాయికి అసలు సంబంధములు రావు ఒక వేళ వచ్చి పెండ్లి అయిపోయినా తిరిగి ఆ అమ్మాయి ఏదో ఒక కారణం చేత తల్లి గారి ఇంట్లోనే ఉంటుంది. ఈ.ఎస్.ఈ. ( ESE ) లో గాని ఎస్.ఎస్.డబ్ల్యు.
( SSW ) లో గాని అమ్మాయి ఫోటోవున్నా లేదా అమ్మాయి రూమ్ వున్నా అమ్మాయి కి అసలు సంబంధములే రావు. డబ్ల్యు.ఎన్.డబ్ల్యు. ( WNW ) జోన్ లో అమ్మాయి రూమ్ గాని లేదా బెడ్ రూమ్ గాని లేదా ఫోటో గాని ఉన్నట్లయితే అమ్మాయికి పెండ్లి కాక అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. అదే విధముగా అమ్మాయి ఫోటో గాని రూమ్ గాని ఆగ్నేయ దిశలో ఉన్నట్లయితే మగపిల్లవారు ఎక్కువ కట్నాలు అడుగుతారు.. పెండ్లి ఖర్చు అనుకున్నదాని కంటే చాలా ఎక్కువ అవుతుంది. ఇలా జ్యోతిష్య, వాస్తుకారణాలు వివాహబాంధవ్యాల విషయంలో తమ తమ ప్రభావాన్ని చూపిస్తాయి..

మరిన్ని వివరాలకు సంప్రదించండి : శ్రీ రుద్రపీఠం.. దేవముని దేవదైవజ్ఞ.. 9346053953..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు