- సంతోష్ నగర్ సర్కిల్ 7 లో ఘటన..
- ఏ.ఎం.హెచ్.ఓ. ఇర్షాద్ ఖాదిర్ వేధింపులే కారణమా..?
హైదరాబాద్ : సంతోష్ నగర్ సర్కిల్ 7 లో ప్రవీణ్ నేత అనే ఎస్.ఎఫ్.ఏ.ని ఏ.ఎం.ఓ.హెచ్. ఇర్షద్ ఖాదిర్ ఎస్.ఎస్. అర్జున్ నాయక్ లు గత కొంతకాలంగా మానసికంగా వేధిస్తున్నారు 20 రోజుల్లోనే రెండుసార్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనికి మనోవేదనకు గురై ఛాతిలో నొప్పి రావడంతో నిన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. ఇది కేవలం ఆఫీసర్లు తనతో చేస్తున్నటువంటి అరాచకాలనే తెలుస్తుంది. ఆఫీసర్లు వర్కర్ల తొలగింపు విషయంలో వారికి సానుకూలంగా వ్యవహరించాలని లేనియెడల నిన్ను ఇంకా టార్చర్ చేస్తామని బెదిరిస్తున్నారు అందుకే తను చాలా కృంగిపోయి మనోవేదనకు గురి కావడంతో నిన్న ఛాతిలో నొప్పి రావడం జరిగింది అతని పరిస్థితి విషమంగా ఉన్నది కావున తనను వేధిస్తున్న ఆఫీసర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు కోరుతున్నారు..