Sunday, October 13, 2024
spot_img

దివ్యాంగులకు పెన్షన్ పెంపు హర్షనీయం

తప్పక చదవండి

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న ఆసరా పెన్షన్ పెంపు నిర్ణయం హర్షనీయం. సీఎం కేసీఆర్ దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3116కు అదనంగా వెయ్యి రూపాయలు కలిపి మొత్తంగా రూ.4, 116 ఆసరా పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకోవడo పట్ల దివ్యాంగులంతా ముక్త కంఠంతో స్వాగతిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో వందలాది సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తూ సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణను నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తూ, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సమన్వయంతో కలిసి పనిచేసి మరో మారు తెలంగాణలో టిఆర్ఎస్ జండాను ఎగరేద్దాం. సదా మీ సేవలో………. ఆర్వి మహేందర్ కుమార్, తెలంగాణ ఉద్యమ నేత, గోషామహల్ నియోజకవర్గం సీనియర్ బిఆర్ఎస్ నాయకులు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు