- మూడు ఇసుక టిప్పర్లు పట్టుకున్న క్రిష్ణ పోలీసులు…
- మైనింగ్, చెక్ పోస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
మఖ్తల్ : నియోజక వర్గం లోని మాగనూరు మండ లం వర్కూర్ ఇసుక రీచ్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని కడెచూర్ ఇండస్ట్రియల్ ఏరియాకు అక్రమ ఇసుక యథేచ్ఛగా తరలుతోంది. రెండు మూడు రోజుల కిందట అక్రమ ఇసుక రవాణా వ్యవహారం పత్రికా విలేకరులు వెలుగులోకి తీసుకు రావడంతో రెండు రోజులు రీచ్ వద్ద ఇసుక తరలింపు ఆపివేశారు. తిరిగి శుక్రవారం ఇసుక కోసం కృష్ణ మండలంలోని చేగుంట గ్రామానికి అనుమతుల పేరు మీదట… కర్ణాటకలోని కడచూర్ పారిశ్రామిక వాడకు అక్రమంగా ఉదయం నుంచి ఇసుక టిప్పర్లు తరలిం చారు. ఈ విషయాన్ని పత్రికా విలేకరులు సాక్షాదారాలతో సహా నిరూపించడంతో… బార్డర్ వద్ద మూడు అక్రమ ఇసుక టిప్పర్లను పట్టుకొని కృష్ణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. చేగుంట గ్రామానికి అనుమతులు తీసుకొని కర్ణాటక కు అక్రమ ఇసుక తరలించడంపై స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే కర్ణాటకకు తరలుతున్న అక్రమ ఇసుక వ్యవహారాన్ని అడ్డుకోవాలని సూచించారు. పత్రికా విలేకరుల ప్రశ్నలపై ఏమాత్రం స్పందించని మైనింగ్ అధికారులతో పాటు… ఉదాసీనంగా వ్యవహరించిన బార్డర్ చెక్ పోస్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తప్పక చదవండి
-Advertisement-