Thursday, May 16, 2024

మేడ్చల్ మున్సిపాలిటీ దినదినాభివృద్ధి అవుతోంది

తప్పక చదవండి
  • మేడ్చల్‌ మున్సిపల్‌ పరిధిలో ఉన్న పలు వార్డుల్లో అభివృద్ధి
  • కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి
    మేడ్చల్‌ : పురపాలక సంఘ పరిధిలో 3,7,8,11,22 వార్డులలో పూర్తయిన వివిధ అభివృద్ది పనులను,రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, చైర్‌ పర్సన్‌ శ్రీమతి మర్రి దీపిక నర్సింహా రెడ్డి, స్థానిక కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సంధర్బంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ప్రగతిలో దేశానికే ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగిందని అన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ మినహా తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి కనిపించేది కాదని రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కరెంటు లేని ఇళ్లే కనిపించేవని, నీరు లేక ఏడారిని తలపించే భూములు తారసపడేవని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, సంక్షేమం ఇలా ఏ రంగం చూసుకున్న తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. ఒకప్పుడు రాష్ట్రం వస్తే తెలంగాణ మరింత వెనకబడి పోతుందంటూ సెటైర్లు వేసిన ఏపీ నాయకులు నోరెళ్లబెట్టేలా కేసీఆర్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వార రాష్ట్రంలోని ప్రతి పల్లె, పట్టణాన్ని అభివృద్ది చేసిన ఘనత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని, కేసిఆర్‌ గారిదని తెలిపారు. మేడ్చల్‌ మున్సిపాలిటీ దినదినాబివృద్ది సాదిస్తుందని అన్నారు. మేడ్చల్‌ మున్సిపల్‌ అబివృద్దికి మేడ్చల్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఎంతో కృషి చేస్తుందని కొనియాడారు, అనంతరం చైర్‌ పర్సన్‌ మర్రి దీపికా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ మేడ్చల్‌ పట్టణ అబివృద్ధికి ఎంతగానో సహకారం అందిస్తున్న మంత్రి మల్లారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మేడ్చల్‌ మున్సిపాలిటీని మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తూ పట్టణ ప్రగతికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నందా రెడ్డి, మేడ్చల్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ చీర్ల రమేశ్‌,మున్సిపల్‌ కమిషనర్‌ వి. రాములు,డి ఈ విజయ లక్ష్మి, మేడ్చల్‌ పట్టణ టిఆర్‌ఎస్‌ అద్యక్షులు శేకర్‌ గౌడ్‌, గుండ్ల పోచంపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ లక్ష్మి శ్రీనివాస్‌ రెడ్డి,, కౌన్సిలర్లు జకట దేవరాజ్‌, తుడుం గణేశ్‌, పెంజర్ల నర్సింహా స్వామి ,సముద్రం సాయికుమార్‌, నడికొప్పు నాగరాజు, బత్తుల శివ కుమార్‌ యాదవ్‌,పానుగంటి సుహాసిని ,మర్రి శ్రీనివాస్‌ రెడ్డి,ఎడ్ల శ్రీనివాస్‌ రెడ్డి,జంగ హరికృష్ణ యాదవ్‌, సాటే మాధవి నరేందర్‌, కౌడే మహేష్‌, కో- ఆప్షన్‌ మెంబర్లు ఆరె గీత, నవీన్‌ రెడ్డి, నాయకులు మర్రి నర్సింహా రెడ్డి, శ్రవణ్‌ కుమార్‌ గుప్తా, సాటే నరేందర్‌ రఫీ, శ్రీహరి, శ్రీకాంత్‌ రెడ్డి, బాల మల్లేశ్‌ ముదిరాజ్‌, వెంకటేశ్‌ ముదిరాజ్‌, శై లెందర్‌, శంకర్‌ ముదిరాజ్‌, సత్యనారాయణ,రామస్వామి,మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు