Friday, April 26, 2024

కిరాయికి దొరుకుతుంది ఈ అక్రమ నిర్మాణం..!

తప్పక చదవండి
  • అత్తా పత్తా లేని అధికార గణం…
  • నోటీలుసు ఇచ్చామంటూ టౌన్ ప్లానింగ్,
    కూల్చివేస్తామంటూ ఎస్.టి.ఎఫ్. టీం..
  • దోబూచులాటల్తో ప్రభుత్వ ధనం దోపిడీ..

హయత్ నగర్, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
డివిజన్ పరిధిలోని బాతుల చెరువు ఎదురుగా అక్రమంగా నిర్మించిన నిర్మాణం పూర్తయి అద్దె దారులకై వేచి చూస్తుంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పన్ను ఎగ్గొట్టి అనుమతి లేకుండా వ్యాపార సముదాయం నిర్మించి అద్దెకిచ్చేందుకు సిద్ధమైనా జిహెచ్ఎంసి అధికారులకు చీమకుట్టినట్లైనా లేదు. అనేక పర్యాయాలు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. నోటీసులు ఇచ్చామని టౌన్ ప్లానింగ్, కూల్చేస్తామంటూ ఎస్ టి ఎఫ్ టీం దోబూచులాడుతున్నారు. ప్రధాన రహదారిపై ఇంత దర్జాగా అక్రమ కట్టడం నిర్మిస్తున్నా చలణం లేని ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి గూడు కట్టుకుంటే వచ్చి కూల్చివేసే అధికారులు, వ్యాపార సముదాయం నిర్మిస్తున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అంటూ అక్రమ నిర్మానుదారుడు కాలర్ ఎగరేస్తున్నాడు. లోగోట్టు పెరుమాళ్ళకెరుక అన్నచందంగా జిహెచ్ఎంసి అధికారులు తీరు అంతుచిక్కకుండా ఉంది. ఇప్పటికైనా ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు