- ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి కార్తీక్ మిస్సింగ్..
- సముద్రంలో దూకి ఆత్మహత్య కనిపించకుండా పోయిన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి కార్తీక్
- ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కనిపించకుండా పోయిన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి కార్తీక్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్.. ఐఐటీహెచ్‌లో బీటెక్ (మెకానికల్) సెకండియర్ చదువుతున్నాడు. అయితే ఈ నెల 17న క్యాంపస్ నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు.
రెండు రోజులైనా తిరిగిరాకపోవడంతో ఆయన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడు విశాఖపట్నం వెళ్లినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా కార్తీక్ ఆచూకీ కోసం గాలించిన పోలీసులకు.. మంగళవారం ఉదయం ఆయన మృతదేహం లభించింది. మృతదేహాన్ని విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. దీంతో సంగారెడ్డి నుంచి విద్యార్థి తల్లిదండ్రులను విశాఖకు తీసుకెళ్లారు.
తప్పక చదవండి
-Advertisement-