Sunday, May 19, 2024

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జరిగేకార్మిక గర్జనను జయప్రదం చేయండి..: ఐఎఫ్టియు

తప్పక చదవండి

ఐఎఫ్టియు అనుబంధ ప్రోగ్రెసివ్ కాంట్రాక్ట్ అండ్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ‘కార్మిక గర్జన’ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనాల జీవోలను విడుదల చేయాలని, యూనివర్సిటీ హాస్టల్స్ ఉద్యోగులకు పిఆర్సి ని అమలు చేయాలని డిమాండ్ చేసారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఉద్యోగులందరికీ, ఆటో కార్మికులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇళ్లని ఇవ్వాలని తదితర డిమాండ్ల పైన ఆగస్టు 4 న ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా జరుగుతున్నది. ఈ ధర్నాలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ పాల్గొనాలని ఓయూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఉద్దేశించి ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఎస్ఎల్ పద్మ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు కావటం లేదని, ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కో విధంగా జీతాలు ఇవ్వదాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన కాంట్రాక్ట్ ,ఔట్సోర్స్ అనే పదం రాష్ట్రంలో ఉండకూడదు అని గతంలో పేర్కొన్నారని గుర్తు చేశారు. 25 ఏళ్లుగా పనిచేస్తున్న ఓ.యు. హాస్టల్స్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులరైజ్ చేయట్లేదని విమర్శించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 56 కనీస వేతనాలు జీఓలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ కార్మికులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోస్టర్ ఆవిష్కరణలో ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు శ్యామల, జయ, సావిత్రి, పద్మ, విజయ, భార్గవి, లత, విజయ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు