ఏఎమ్‌ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘‘రాజు గారి కోడిపులావ్’’ కుటుంబ కథా ‘వి’చిత్రం అనేది ట్యాగ్. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శివ కోన ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ట్రైలర్ విడుదల అవడంతో సోషల్ మీడియాలో మంచి బజ్ కనిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగించుకుని ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరోయిన్ రమ్య గిరీష్ మాట్లాడుతూ.. తనకు తెలుగులో మొదటి సినిమా అవకాశమిచ్చిన డైరెక్టర్ శివకోనకి ధన్యవాదాలు తెలిపారు. రాజు గారి కోడిపులావ్ చిత్రీకరణ ఓ సాహసంగా జరిగిందని, ఇది కచ్చితంగా ధమ్ బిర్యాని రుచి అంత బాగుంటుందని పేర్కొన్నారు.
హీరో అభిలాష్ మాట్లాడుతూ.. ముందుగా మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఇక డైరెక్టర్ శివ కోన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని, రొటీన్ గా ఉండదని, చాలా కొత్తగా మిస్టీరియస్ గా రాజు గారి కోడిపులావ్ ఉంటుందని అన్నారు. ఇది ఓటీటిలో చూసే సినిమా కాదని కచ్చితంగా బిగ్ స్క్రీన్ లోనే చ చూడాల్సిన సినిమా అని పేర్కొన్నారు. డైరెక్టర్ శివ కోన చాలా కష్టపడ్డారని, ప్రొడక్షన్ మెయింటెనెన్స్ తో పాటు ఆర్టిస్టుల బాగోగులు కూడా దగ్గరుండి చూసుకున్నారని కొనియాడారు. ఇక సినిమా కంటెంట్ ను నమ్మి చిన్న ఆర్టిస్టులైన మాతో చేయడానికి ఒప్పుకున్నందుకు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
హీరోయిన్ ప్రాచీ ఠాకూర్, కునాల్ కౌశిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన రవి, హీరోయిన్ నేహా దేశ్ పాండే, ఈటీవీ ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ.. ముందుగా టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజు గారి కోడి పులావ్ ఇంత టేస్టీగా ఉండడానికి ముఖ్య కారణం కాస్ట్ స్టాండ్ క్రూ అంతా తమ సినిమా అనుకోని కష్టపడ్డారని తెలిపారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ పేరు క్యాండీ అని, మామూలుగా క్యాండీ అంటే రుచికి పుల్లగా, తీయగా, వగరుగా ఉంటుందని తన పాత్ర కూడా అలాగే చాలా వినుత్వంగా ఉంటుందని చెప్పారు. సినిమాను కచ్చితంగా థియేటర్లో చూడాలని ఎందుకంటే ఇది అద్భుతమైన రుచి కలిగిన వంటకం అన్నారు. ఈ సినిమాకు పవన్ గుంటుకు సినిమాటోగ్రాఫర్ గా, సినిమాకు ప్రాణం అయిన సంగీతాన్ని ప్రవీణ్ మనీ, ఎడిటర్ గా బసవ పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా రాజు గారి కోడి పులావ్ ఆగస్ట్ 4న విడుదల కావడానికి రంగం సిద్ధం అయింది.
తప్పక చదవండి
-Advertisement-