- విద్యాశాఖ కార్యదర్శికి బాధ్యతలు
హైదరాబాద్ : నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జి వీసీగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా ఇటీవలే చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం దాసరి శంకర్ అనే వ్యక్తి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా రవీందర్ గుప్తాను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజిలెన్స్ అధికారులు ఒకట్రెండు సార్లు యూనివర్సిటీలో విస్తఅతంగా తనిఖీలు నిర్వహించారు. వీసీకి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పామని వర్సిటీకి వచ్చిన చాలా మందిని విజిలెన్స్ అధికారులు విచారించారు.
విద్యాశాఖ కార్యదర్శికి బాధ్యతలు
తప్పక చదవండి
-Advertisement-