Friday, May 17, 2024

హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండండి..

తప్పక చదవండి
  • అధికారులు హెచ్చరిస్తున్నారు..
  • తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు..
  • కానీ స్వీయ నియంత్రణ పాటించడం ముఖ్యం..
  • అవసరం ఉంటే తప్ప బయటకు రాకండి..

భాగ్యనగరంలో మళ్ళీ వర్షం మొదలైంది. వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ రోడ్ 45, రోడ్ నంబర్ 10, పెద్దమ్మతల్లి రోడ్డు, అపోలో హాస్పిటల్ రోడ్‌లో వర్షం కారణంగా పెద్దఎత్తు ట్రాఫిక్ జాం అయ్యింది. మెల్లిమెల్లిగా వాహనాలు ముందుకుసాగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్న రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌లో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కాగా.. గత వారం నాలుగు రోజుల పాటు ఎడతెరిపిలేకుండా కురిసి నగరవాసులను అతలాకుతలం చేసిన వాన కాస్త విరామం ఇచ్చింది. గత రెండు రోజులుగా వర్షం పడకపోవడంతో ప్రజలు యధావిధిగా తమ జీవనాన్ని సాగించారు. అయితే ఈరోజు మరోసారి నగరంలో వర్షం మొదలవడం.. ట్రాఫిక్‌ జాంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు