Tuesday, June 25, 2024

ఆరోగ్యమే మన ఇంటి సౌభాగ్యం..

తప్పక చదవండి
  • ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు పోదాం
  • రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా వైద్య ఆరోగ్య డాక్టర్లకు,
    ఆశా వర్కర్లకు ఏ.ఎన్.ఎం. లకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రభుత్వ విప్,
    అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు..

హైదరాబాద్, అచ్చంపేట పట్టణం శ్యామ్స్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వైద్య ఆరోగ్య దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డాక్టర్ గువ్వల బాలరాజు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అచ్చంపేట ప్రజల సమస్యలపై నిరంతరంగా సేవకుడిలా పనిచేస్తానని అన్నారు.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలతో ప్రజా వైద్యంపై ప్రజల్లో పెరిగిన నమ్మకం… స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే దేశానికి వైద్యారోగ్య రంగం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సాధించుకున్న తెలంగాణను మన పాలనను అందిపుచ్చుకోవాలి. ఎవరైనా మీ సేవలకు అంతారాయం కలిగిస్తే, దాడులకు దిగితే మేము అండగా ఉంటాము అని డాక్టర్లకు సూచించారు.. ఆశ వర్కర్లకు, ఏ.ఎన్.ఎం. లకు వారి సమస్యలను, ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, ఇతర అవకాశాలు గాని ప్రభుత్వానికి సూచన చేస్తానని హామీ ఇచ్చారు. ఆశ వర్కర్ అలివేల మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు రూ. 2000 జీతంతో బ్రతుకులు హీనంగా ఉండే. తెలంగాణ చిందించాక రూ. 9600 వేతనం చెల్లిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈ రోజు రాష్ట్ర రాజధానిలో 3800 వ హాస్పిటల్ కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్లు, బలాన్ని చేకూర్చే సౌకర్యం కల్పిస్తున్నాము. అచ్చంపేట్ 100 పడకల ఆస్పత్రి ఓపెనింగ్ రోజే డయాలసిస్ పేషెంట్లు వేరే నియోజవర్గం నుండి వచ్చారు. సీఎంతో ఉన్న అనుబంధంతో రెవెన్యూ డివిజన్ సాధించుకున్నాం. ఏ. ఎన్. ఎం., ఆశ వర్కర్ల సమస్యల గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడుతాను. అచ్చంపేట ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుదాం అన్నారు ఎమ్మెల్యే గువ్వల.. ఈ కార్యక్రమంలో వైద్య బృందం, ఆశ వర్కర్లు, ఏ.ఎన్.ఎం.లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు