Friday, May 17, 2024

లక్ష రూపాయల రుణసాయం జాబితాలో పద్మశాలీలను చేర్చాలి..

తప్పక చదవండి

హైదరాబాద్,బుధవారం రోజు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు ఆప్పం శ్రీనివాస్ రావు, చేనేత సహకారం సంఘం జిల్లా అధ్యక్షులు కడారి బిక్షంల ఆధ్వర్యంలో వెనుక బడిన తరగతుల చేతి వృత్తి దారుల లకు ఇచ్చే లక్ష రూపాయల రుణసాయం జాబితాలో పద్మశాలిలను కూడా చేర్చాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కి మెమోరాండం/వినతిపత్రం అందజేయడం జరిగింది. అనంతరం అప్పం శ్రీనివాసరావు మాట్లాడుతూ… మనదేశంలో వ్యవసాయం తర్వాత రెండో వృత్తి చేనేత వృత్తి.. మనిషికి కావలసింది తిండి తర్వాత బట్ట.. చేనేత వృత్తిని నమ్ముకుని బట్టలు నేసి, కార్పొరేట్ సంస్థలతో పోటీ పడలేక రెండు పూటలా తిండి కూడా లేక కుటుంబం మొత్తం వస్తువులతో ఉండి, అప్పులు ఎక్కువై వాటిని తీర్చే లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతుల ఆత్మహత్యల తర్వాత స్థానం చేనేత కార్మికులదే ఉన్నది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేతివృత్తుల వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామని ప్రకటించిన 17 కులాలలో చేనేత వృత్తిని చేర్చకపోవడం చాలా బాధాకరమైన విషయం. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చేనేత వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారని, ఆధునిక పోటి ప్రపంచంలో పోటీ పడలేక చేనేత వృత్తి కుంటుపడిపోవడంతో కడు దుర్భరమైన జీవితాన్ని సాగిస్తున్నారు. నాడు స్వాతంత్ర ఉద్యమంలో స్వదేశీ వస్త్రాల ఉద్యమం ఒక చారిత్రక ఘట్టం చేనేతను రక్షించడానికి స్వయంగా మహాత్మా గాంధీ చరకాపట్టి ఉతమిచ్చాడు. ఇప్పటికీ మన రాష్ట్రంలో సుమారు మూడు లక్షల చేనేత కుటుంబాలు ముంబాయి, సోలాపూర్, సూరత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్ళినారు.. ఇది చారిత్రక సత్యం. ఇంకా అక్కడక్కడ మిగిలిన వారిని ప్రభుత్వపరంగా ఆదుకొని వారిని బ్రతికించుకోవడం ప్రభుత్వం బాధ్యత అని, చేనేత కుటుంబాలు వేరే పనులు చేయలేక చేనేత కలను మాత్రమే నమ్ముకొని జీవిస్తున్నావారికి బతుకుపై భరోసా కల్పించి, నిరాశ, నిస్సృహతో ఉన్న మా చేనేత వృత్తిని 100శాతం సబ్సిడీతో ఇస్తున్న ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకంలో పద్మశాలి కులాన్ని చేర్చి.. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, మలిదశ ఉద్యమంలో నిరుపేద పద్మశాలి ముద్దుబిడ్డ సిరిపురం యాదయ్య ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణలో వారి ఆత్మలకు శాంతి కలిగించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి చలమల్ల నర్సింహ, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లే సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి యలగందుల సుదర్శన్, జిల్లా సహాయ కార్యదర్శి దూలం నగేష్, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మిరియాల గోపాలకిషన్, యువజన సంఘం అధ్యక్షుడు మిట్టకోల యుగంధర్, ప్రచార కార్యదర్శి పున్నా వెంకన్న, కొంగరీ ఉపేందర్, కేతం వెంకటేశం, రావిరాల మల్లయ్య, జెల్ల శివాజీ, ముషం శ్రీధర్, తాటి వేంకటరమణ, విడెం ఉపేందర్, సంగిశెట్టి ఆంజనేయులు, భీమానపల్లి వెంకటేశ్వర్లు, పులిపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు