Tuesday, May 7, 2024

వాహనాలకు నకిలీ పత్రాలు సృష్టించి మోసాలు చేస్తున్న వ్యక్తి అరెస్టు..

తప్పక చదవండి

హయత్‌ నగర్‌ : మార్కెట్లో డిమాండ్‌ ఉన్న వాహనాలను కొని వివిధ సంస్థల నుండి రుణాలు పొంది కొన్ని వాయిదాలు కట్టి అనంతరం నకిలీ పత్రాలను సృష్టించి అమ్ము తున్న నాగరాజు అనే వ్యక్తిని ఎస్‌ఓటి భువనగిరి, హయత్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు. శుక్రవారం ఎల్బీనగర్‌ డిసిపి సాయి శ్రీ బత్తిన హయత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. వైజాగ్‌ కు చెందిన నాగరాజు 2018 నుండి హైదరాబాదులో ఈ వ్యవహారాలను నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముందుగా ఒక కారును కొనడం కొన్ని వాయిదాలు కట్టి కారు వాయిదాలు అయిపోయాయని తప్పుడు ఎన్‌ఓసి సృష్టించి మళ్ళీ కొత్తగా ఇంకో బ్యాంకు నుండి ఫైనాన్స్‌ తీసుకుంటున్నారు అని తెలిపారు. ఈ విదంగా మొత్తం 5కార్ల వరకు ఫైనాన్స్‌ తీసుకోవటం జరిగిందని ఎల్‌ బీనగర్‌ డీసీపీ వెల్లడిరచారు. ఈ ఫ్రాడ్‌ లో కొంతమంది రవాణా శాఖ అధికారులను కూడా మోసం చేయటం జరిగిందని అన్నారు. నిందితుని వద్ద నుండి 5 కార్లు, ఒక ద్విచక్ర వాహనం, 3 సెల్‌ ఫోన్లు, లాప్టాప్‌, నకిలీ పత్రాలు, నకిలీ రబ్బర్‌ స్టాంపులు, స్వాధీనం చేసుకున్నామని దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు