Wednesday, July 24, 2024

ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోడాక్టర్లుండేది రెండు గంటలేనట..?

తప్పక చదవండి
 • ప్రభుత్వ దవాఖానలో వైద్యులు
  2 గంటలే ఆన్లైన్‌..తరువాత ఆఫ్‌ లైన్‌
 • మధ్యాహ్నం 12 దాటితే పత్తా..
  జాడలేకుండా పోతున్న వైద్యసిబ్బంది
 • స్వంత క్లినిక్‌ల నిర్వాకంతోనే
  పరుగులు తీస్తున్నారంటూ ప్రచారం
 • అరిగోసలు పడుతున్న రోగులు
  పట్టించుకున్న నాధుడు కరువు…
 • దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో
  నిత్యకృత్యమైన పరిస్థితి..
 • ప్రజా సంఘాల ఆధ్వర్యంలో
  సూపరెంటెడ్‌కి ఫిర్యాదు..
 • వైద్యులపై విచారణ జరిపి
  చర్యలు తీసుకుంటానని హామీ.

హైదరాబాద్‌ : దేవరకొండ పట్టణం పరిధిలోగల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల తీరు రోగులను అష్టకష్టాలపాలు చేస్తుంది.ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణను పట్టించుకునే నాధుడు కరువవ్వడడంతో వైద్యులు,సిబ్బంది సమయపాలన అస్సలు పాటించడంలేదంటూ రోగులు ఆరోపిస్తు న్నారు. ఉదయం 10 గంటలకు రావడం రెండే రెండు గంటలు ఉండి విధుల నుంచి నిష్కమించడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిలో చాల మందికి స్వంత క్లినిక్‌ లు ఉండటంతోనే ఇలా ప్రవర్తిస్తున్నా రంటూ ప్రచారం జరుగుతుంది. వీటిపై ప్రధానంగా ద్రుష్టి సారించాల్సిన అధికారులు వైద్యులకు వత్తాసు పలకడంతో సమస్య జఠిలమయ్యిందని చెప్పుకోవచ్చు.
ఆన్లైన్‌ దరఖాస్తు విధానం రోగులకు యమపాశం..
రోగుల వివరాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆన్లైన్‌ దరఖాస్తు విధానం రోగులకు యమపాశంగా మారింది. రోగులు గంటల తరబడి ఆన్లైన్‌ నిలబడి దరఖాస్తు చేసుకుని వైద్యుడి దగ్గరికి వెళ్ళితే తీరా ఆ వైద్యుడు ఓపి నుండి వారి సొంత క్లినిక్‌ లోకి వెళ్లిపోవడం రోగులను ఇబ్బందులకు గురిచేస్తుంది.
దేవరకొండ నియోజకవర్గం పరిధిలో పలు మండలాలు , గ్రామాల నుండి మెరుగయిన వైద్యం కోసం నిరుపేదలు దేవరకొండ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి రావడం అందరికి తెలిసిన విషయమే.నిత్యం వందలాది మంది రోగులు మెరుగయిన వైద్యం కోసం ఆసుపత్రి కి వచ్చిన వారికీ సరయిన వైద్యం అందడం లేదన్నది రోగులు, స్థానికులనుంచి వస్తున్నా పిర్యాదు. వైద్యం కోసం వచ్చిన రోగులు అవస్థలు పడుతున్న పట్టించుకున్న అధికారులు, ప్రజాప్రతినిదులు లేరనే చెప్పాలి.
రోగులకు అంతమాత్రంగానే వైద్యం
ఆసుపత్రిలో ఎక్కువశాతం బెడ్లు రోగులు లేకుండా ఖాళీగానే ఉంటున్నాయి.రోగులకు స్ట్రక్చర్‌ పై సిలైన్‌ పెట్టి వైద్యులు నర్సులు మరిచిపోయిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు రోగులను పరీశీలిస్తున్న సమయంలో ఎక్కువ సమయం ఫోన్లో గడపడం పనిచేసే ఆ రెండు గంటలు తమ సొంత క్లినిక్‌ లు ఎక్కడ ఉన్నాయో వాటి వివరాలు రోగులకు వివరిస్తూ అక్కడికి వస్తే మీకు సరైన వైద్యం అందిస్తామని చెప్పడం ఇక్కడ దీనస్థితికి అద్దంపడుతోంది.
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సూపరెంటెడ్‌ కు పిర్యాదు
దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు రోగులను పట్టించుకునే పరిస్థితి లేదని ప్రజా సంఘాల నాయకులు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ చింతపల్లి శ్రీనివాస్‌ గౌడ్‌ , కంబాలపల్లి వెంకటయ్య సూపర్డెంట్‌ వైద్య అధికారి రాములు నాయక్‌ కు వినతిపత్రం అందజేశారు. ఆసుపత్రి లో పనిచేసే డాక్టర్లు సమయ పాలన పాటించకపోవడంతో రోగులు ఇబ్బందిపడుతున్నారని ప్రజా సంఘాల నాయకులు సూపర్డెంట్‌ కు దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన సూపర్డెంట్‌ వైద్య అధికారి రాములు నాయక్‌ పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు చేల్లేటి భాస్కరచారి,విఠలాచారి, కృష్ణమా చారి,రాచమల్ల నాగయ్య,తోటపల్లి శ్రీను,అరగంటి సురేష్‌,శ్రీను, అబ్దుల్‌ కలాం,వెంకులు,విహెచ్పిస్‌ నాయకులు, శ్రీరామదాసు, రామాచారి,మాతంగి శీను,మైనంపల్లి మాజీ సర్పంచ్‌ జాను నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు