Friday, May 17, 2024

అమెరికా ఎన్నికల బరిలో మహిళా ఎన్నారై..

తప్పక చదవండి
  • విస్కాన్సిన్‌ నుంచి సెనేట్‌ బరిలో రెజనీ రవీంద్రన్‌..
  • కొనసాగుతున్న భారతీయుల హవా..
  • ఇప్పటికే కీలక పదవుల్లో భారతీయుల బాధ్యతలు..
    విస్కాన్సిన్‌ : అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఆ దేశ ఉపాధ్యక్ష పదవితో పాటు ఇతర పలు కీలక పదవుల్లో మనోళ్లు బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఇలా యూఎస్‌ పాలిటిక్స్‌లో ఎన్నారైల ప్రాబల్యం అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా రెజనీ రవీంద్రన్‌ అనే భారత సంతతి కాలేజీ విద్యార్థిని విస్కాన్సిన్‌ నుంచి యూఎస్‌ సెనేట్‌ బరి లో నిలుస్తున్నట్లు ప్రకటించారు. రిపబ్లికన్‌ పార్టీ నుంచి అక్కడి డెమొక్రటిక్‌ సెనేటర్‌ టావిూ బాల్డ్‌విన్‌పై పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రెజనీ రవీంద్రన్‌ మాట్లాడుతూ.. ’నేను చాలా మంది రాజకీయ నేతలు, లాబీయిస్టులు, పాలసీ మేకర్స్‌ను కలిశాను. వారిలో చాలా మంది 20, 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మనమే వారిని ఎన్నుకుంటున్నాం, అధికారాన్ని ఇస్తున్నాం. అయితే వారు మాత్రం వాషింగ్టన్‌ డీసీలో సుఖంగా ఉంటున్నారని’ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఎన్నుకునే మనల్ని మరిచిపోయినప్పుడు, వారిని అక్కడికి పంపించడం వల్ల లాభం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇక వేసవి ప్రారంభంలో వాషింగ్టన్‌ పర్యటన తర్వాత సెనేట్‌కు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా, రెజనీ రవీంద్రన్‌ 2011లో ఇండియా నుంచి అమెరికా వలస వెళ్లారు. 2015లో ఆ దేశ పౌరసత్వం పొందారు. మొదట రెండేళ్లపాటు కాలిఫోర్నియాలో ఉన్నారు. ఆ తర్వాత 2017లో విస్కాన్సిన్‌కు వెళ్లారు. ప్రస్తుతం అక్కడే స్థిరపడ్డారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు