Sunday, May 19, 2024

కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసిరూ. 2.50 లక్షలకు ఉద్యోగం అమ్మకం

తప్పక చదవండి
  • వికారాబాద్‌లో వెలుగులోకి షాకింగ్‌ ఘటన
    వికారాబాద్‌ : ఉద్యోగం ఇప్పిస్తానని మోసానికి పాల్పడిరది ఓ కిలాడీ లేడి. ఏకంగా కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ.2.50లక్షలకు ఉద్యోగాన్ని అమ్మే సింది. జాయినింగ్‌ కోసం వెళ్లడంతో బాధితురాలు ఫేక్‌ జాబ్‌ అని తెలిసి పోలీ సులను ఆశ్రయించింది. ఈ షాకింగ్‌ సంఘటన వికారాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్‌ డీఎస్పీ నర్సింలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా తంగేళ్లపల్లికి చెందిన శిరీష అలియాస్‌ అనూష తను రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో ఎమ్మార్వోగా పనిచే స్తున్నానని, వికారాబాద్‌ తాసిల్దార్‌ కార్యా లయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఖాళీగా ఉందని హైదరాబాద్‌ మౌలాలికి చెందిన వాణిరెడ్డికి వల వేసింది. వాణిరెడ్డికి వికారాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఉద్యోగం కోసం రూ. 2లక్షల యాభై వేల రూపాయల వరకూ వసూళ్లు చేసింది.ఉద్యోగం కోసం వికారాబాద్‌ జిల్లా మాజీ కలెక్టర్‌ నిఖిల పేరుమీద ఫోర్జరీ చేసి అపాయింట్మెంట్‌ లెటర్‌ ఇచ్చింది. అది ఫేక్‌ అపాయింట్‌మెంట్‌ అని తెలియక జాయిన్‌ కావడానికి వాణిరెడ్డి కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చింది. అయితే బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్‌ ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదని గ్రహించిన ఉద్యోగులు ఆ లెటర్‌ ఫేక్‌ గా వాణి రెడ్డికి చెప్పడంతో ఆమె షాక్‌ కు గురి అయింది. మోసపోయానని గ్రహించి వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వాణి రెడ్డి. ఆమె ఫిర్యాదుతో అనూషను అరెస్టు చేసి డబ్బులు స్వాధీనం చేసుకొని రిమాండ్‌ కు తరలించారు పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేసే వ్యక్తుల పట్ల ప్రజలు జాగ్రత్త ఉండి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని డీఎస్పీ తెలిపారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు