Tuesday, June 25, 2024

గుంట భూమి రిజిస్ట్రేషన్ పేరిట మందిని ముంచుతున్న గుంటనక్క..

తప్పక చదవండి
  • 12 వెల్త్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్.. మేనేజింగ్ డైరెక్టర్
    కలిదిండి పవన్ కుమార్.. చేస్తున్న నయాదందా..
  • ఉత్తమ పెట్టుబడి ప్రణాళిక అంటూ ఉత్తుత్తి కబుర్లు..
  • రూ. 4 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ. 16 వేలు ఇస్తానని కనికట్టు..
  • 25 నెలల పాటు చెల్లిస్తానని బూటకపు మాటలు..
  • ఒక గుంట వ్యవసాయ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తాడు..
  • 121 గజాల భూమిని అధికారులు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో అర్ధం కాదు..
  • 25 నెలల అనంతరం రూ. 4 లక్షలు కలిపి రూ. 8 లక్షలు తిరిగి చెల్లిస్తామంటాడు..
  • చెల్లించిన పిదప తిరిగి గుంట భూమిని కంపెనీకి రిజిస్ట్రేషన్ చెయ్యాలని కండిషన్..

కలిదిండి పవన్ కుమార్.. ఇతగాడు 12 వెల్త్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్.. ప్లాట్ నెంబర్ : 10, ఫ్లాట్ నెంబర్ 202, సెకండ్ ఫ్లోర్, అనసూయ నిలయం, వివేకానంద నగర్ కాలనీ, బాఘ్మీరి, కూకట్ పల్లి, హైదరాబాద్ లో తన కార్యాలయాన్ని నడుపుతున్నాడు.. తన మాయమాటలతో ఎంతో మంది అమాయకులను మోసం చేశాడు.. చేస్తున్నాడు.. అతగాడి నయాదందాపై ఓ నజర్ వేద్దాం..

12 వెల్త్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట దుఖాణం తెరిచాడు.. కూకట్ పల్లిలో అద్భుతమైన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు.. తన జిత్తులమారి తెలివితేటలకు పదును పెట్టాడు.. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశపడే అమాయకులకు గాలం వేశాడు.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది నెత్తిన శఠగోపం పెట్టాడు.. తన కంపెనీలో నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టండి.. నెలకు రూ. 16 వేలు చెల్లిస్తాను.. ఈ విధంగా 25 నెలల పాటు చెల్లిస్తానని చెబుతాడు.. అదే కాకుండా అడ్రస్ లేని భూమిలో ఒక గుంట వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తానని మభ్యపెట్టి, వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ ఆఫ్ సేల్ విత్ పొజిషన్ అంటూ బోగస్ సేల్ డీడ్స్ ఇస్తూ దర్జాగా మోసం చేస్తాడు.. 25 నెలల అనంతరం రూ. 4 లక్షలు కలిపి మొత్తం రూ. 8 లక్షలు చెల్లిస్తాను అని చెబుతాడు.. అమౌంట్ చెల్లించిన తరువాత ఒక్క గుంట వ్యవసాయ భూమిని తిరిగి కంపెనీ పేరుమీద రిజిస్ట్రేషన్ చేయాలనే కండిషన్ పెట్టాడు.. ఒకవేళ రూ. 8 లక్షలు చెల్లించని పక్షంలో ఆ ఒక్క గుంట భూమి వారికే చెందుతుందని చెబుతాడు.. అయితే అసలు ఆ భూమి ఎక్కడ ఉందో తెలియదు.. ఒక్క గుంట వ్యవసాయ భూమిని రెవెన్యూ అధికారులు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో అర్ధం కాదు.. సంగారెడ్డి జిల్లా, ఆంథోల్ మండలం, ఆంథోల్ జోగిపేట డివిజన్, రామ్ సాన్ పల్లి గ్రామంలో భూమి ఉందని, ఆ సర్వే నెంబర్ 490/లూ గా చెబుతూ బై నెంబర్లు వేసి బోగస్ గిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం ఇతగాడి స్పెషాలిటీ.. కాగా బాధితులైన అమాయకులు కట్టిన డబ్బును షేర్స్ లో, ఈ కామర్స్ లో, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ లో, బియర్ మార్కెట్, ఇన్సూరెన్స్, గ్రోత్ లో, ట్రేడింగ్ లో, రియల్ ఎస్టేట్ లో మై షేర్స్ లో, యుటిలిటీలో ఇన్వెస్ట్ చేసి, లాభాలు గడిస్తున్నాను కనుక మీ డబ్బులకు ఎలాంటి డోకా లేదని నమ్మిస్తాడు.. అతగాడు చెబుతున్నట్లుగా అక్కడ అసలు భూమి లేదు.. తాను చెబుతున్నట్లుగా 490/ లూ సర్వే నెంబర్ లో 120 ఎకరాల భూమి వున్నట్లుగా కలరింగ్ మాత్రం ఇస్తాడు.. ఇదే కాకుండా ఇతగాడి ఆధ్వర్యంలో నడుస్తున్న కలిదిండి రీసార్ట్స్ లో ఒక వారం రోజులపాటు డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వారికి అకామిడేషన్ ఇస్తాడు.. డిజిటల్ మాయాజాలంతో.. రంగురంగుల బ్రోచర్లతో తన అరచేతిలో స్వర్గాన్ని చూపించి తడిగుడ్డతో గొంతులు కోయడం కలిదిండి పవన్ కుమార్ కి వెన్నతో పెట్టిన విద్య..

- Advertisement -

అసలు 12 వెల్త్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సదరు వ్యక్తి పవన్ కుమార్ చేస్తున్న అనేకానేక మోసాలు ఏమిటి..? ఇతగాడు చేస్తున్న మోసాలకు సహకారం అందిస్తున్న రెవెన్యూ అధికారులు ఎవరు..? ఇతడి వెనకాల వున్న బడా బాబులు ఎవరు..? గతంలో కూడా ఈయన చేసిన మోసాలు ఏమిటి..? ఎంతమంది ఇతడి చేతిలో మోసపోయారు..? 12 వెల్త్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి గుర్తింపు ఇచ్చింది ఎవరు..? ఎన్ని కోట్ల రూపాయల అక్రమ దందా చేశాడు..? ఇంకా చేస్తున్నాడు..? అన్న వివరాలను సంపూర్ణ ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని రానుంది.. ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు