Friday, October 11, 2024
spot_img

ఎల్బీనగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 50 కార్లు దగ్ధం.. !

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివారుల్లోని ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఎల్బీ నగర్ సద్గురు కాలనీలోని కారు ఓ మ్యాన్ సర్వీసింగ్ సెంటర్‌లో షార్ట్ షర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.దాని పక్కనే ఉన్న టింబర్ డిపోకు మంటలు వ్యాపించాయి. ‘కారు ఓమెన్ కారు షోరూమ్’ అనే ఈ పాత కార్ల గ్యారేజీలో సిలిండర్లు ఉండటంతో భారీగా పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఆ కార్ల గ్యారేజీలో 50కి పైగా కార్లు పూర్తిగా బూడిదయ్యాయి. మంటలకు టైర్లు, కార్ల పెట్రోల్ ట్యాంకులు పేలడంతో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. గ్యారేజీలో సిలిండర్లు కూడా ఉండటంతో పేలుళ్లు సంభవిస్తున్నట్లు తెలుస్తున్నది. మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకున్నది. దీంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అప్రమత్తమైన పోలీసు, పౌర అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక దళ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా, టింబర్ డిపో చుట్టుపక్కల వారిని ఇండ్ల నుంచి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు