Tuesday, May 21, 2024

సిగరెట్‌ మానేస్తే ఎన్నెన్నో ప్రయోజనాలు..

తప్పక చదవండి

ఏదో సరదాకి.. ఒక్కసారి అంటూ మొదలైన ధూమపానం వ్యసనంగా మారి ఎందరో బలి అవుతున్నారు. అది ప్రమాదకరమని తెలిసినా చాలామంది ఆ అలవాటు నుంచి బయటపడలేక ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ ప్రాణాంతకమైన పొగాకును నియంత్రించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987లో నిర్ణయించింది. మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవాలని 1988లో పిలుపునిచ్చింది. అప్పట్నుంచి పొగాకు నియంత్రణ కోసం ప్రచారాలు చేస్తూనే ఉంది.. ఎంతోమంది వైద్యనిపుణులు కూడా అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయినా సరే పొగాకు వినియోగం తగ్గకపోగా.. రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ధూమపానం కారణంగా ఎంతోమంది క్యాన్సర్‌, గుండె జబ్బుల బారిన పడుతూనే ఉన్నారు.

సిగరెట్ మానేయడం వల్ల 128 గంటల్లోపు రక్త ప్రసరణ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. 24 గంటల్లో నికోటిన్ శరీరం నుంచి వైదొలుగుతుంది. 48 గంటల్లో వాసన, రుచి చూడటం మెరుగవుతుంది.. 78 గంటల్లో శ్వాసక్రియ బాగా అభివృద్ది చెందుతుంది. 9 నెలలలోపు దగ్గు 10 శాతం తగ్గిపోతుంది. 12 నెలల లోపు గుండె జబ్బుల ప్రమాదం 50 శాతం తగ్గిపోతుంది.. 10 సంవత్సరాలలోపు ఊపిరితిత్తుల క్యాన్సర్ 50 శాతం తగ్గిపోతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు