Tuesday, April 30, 2024

అమాయకులను కాటేస్తున్న నాగరాజు ‘దేవు’..

తప్పక చదవండి
  • లోన్లు ఇప్పిస్తామంటూ విషపు వల విసుతున్న వైనం..
  • ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో టోకరా..
  • ఎఫ్.డీ.ఐ. ఇప్పిస్తామంటూ లూటీ చేస్తున్న ఘరానా మోసగాళ్లు..
  • ఫిన్ పెయిర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుమీద వైట్ కాలర్ దందా..

ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటూ కటింగులు ఇస్తారు.. కోట్లలో లోన్స్ ఇస్తామని మభ్యపెడతారు.. వీరి మాయమాటలు నమ్మి వీరి వలలో పడ్డారో.. అంతే సంగతులు.. ఎప్.డీ.ఐ., ఎన్.బీ.ఎఫ్.సి. ప్రైవేట్ ఫైనాన్స్, మార్టిగేజ్ లోన్స్ పేరుతో కోట్లు దండుకుంటూ మొహం చాటేస్తున్న దుర్మార్గులు.. ఫేక్ లోన్ శాంక్షన్ లెటర్లు చూపిస్తూ.. సర్వీస్ చార్జీల పేరుమీద ఇప్పటికే పలువురు అమాయకుల వద్ద కోట్ల రూపాయలు దండుకున్న నీచమైన చరిత్ర వారిది..

కొంత మంది చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.. తమ పరిశ్రమలను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకుని రావాలను కుంటారు.. మరికొంతమంది ఔత్సాహికులు కొత్త పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపించాలనుకుంటారు.. అయితే వారికి ఫైనాన్స్ క్రైటీరియా ఎదురవుతూ ఉంటుంది.. ఇలాంటి వారినే టార్గెట్ చేస్తున్నారు.. నాగరాజు దంపతులు.. అరచేతిలో స్వర్గం చూపిస్తారు.. ఫిన్ పెయిర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఎఫ్.డీ.ఐ., ఎన్.బీ.ఎఫ్.సి. ప్రైవేట్ ఫైనాన్స్, మార్టిగేజ్ లోన్స్ ఇప్పిస్తామంటూ కోట్లు దండుకుంటున్నారు ఈ దుర్మార్గులు.. మాదాపూర్, హైటెక్ సిటీ దగ్గరలో కళ్లుచెదిరే, అందమైన ఆఫీసును నెలకొల్పి, మరికొంత మందిని డైరెక్టర్స్ గా పెట్టి వారికి ట్రైనింగ్ ఇచ్చి అమాయకులకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి, వారికి వందల కోట్లలో ఫేక్ ఎఫ్.డీ.ఐ. శాంక్షన్ లెటర్స్ చూపిస్తూ.. వారివద్ద నుంచి సర్వీస్ ఛార్జ్ కింద కోట్లు కొల్లగొడుతూ తమ లైఫ్ లను ఎంజాయ్ చేస్తూ.. మోసపోయిన వారి జీవితాలతో ఆడుకుంటున్నారు ఫిన్ పెయిర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ దేవు నాగరాజు, అతని భార్య దిలీష్క దేవ్..

- Advertisement -

ఫిన్ పెయిర్ సొల్యూషన్స్ పేరుతో కంపెనీ స్థాపించి, అందమైన వెబ్ సైట్ ని రెడీ చేయించి, మరి కొంతమందిని డైరెక్టర్స్ గా చేసి, అమాయకులను లోన్లు ఇప్పిస్తామని బుట్టలో వేసుకుంటూ కోట్లలో ముంచుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా దందా నడుపుతున్నారు.. పైగా వీరు ముంబైలో ఒక రిజిస్టర్ కార్యాలయం పెట్టి, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ ఈ దందాను నడిపిస్తూ అమాయకులను మోసం చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నారు.. అయితే వీరిద్దరు భార్యా భర్తలకు, ఫిన్ పెయిర్ సొల్యూషన్స్ కంపెనీకి, ముంబైలో ఉన్నటువంటి పీబీసీ గ్రూప్ అధినేత రోనీ రోడ్రిసిస్ కి ఉన్న సంబంధం ఏమిటి..? పైగా వీరు కేటీఆర్ బంధువునని చెప్పుకుంటున్న నాగరాజు అసలు కేటీఆర్ బంధువేనా..? ఒకవేళ ఆయన బంధువైతే ఈ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఏంటి..? అన్న దానిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది.. అసలు ఎప్.డీ.ఐ., ఎన్.బీ.ఎఫ్.సి. అనేవి నిజంగా ఉన్నాయా..? ఉంటే వాటి నిబద్ధత ఏమిటి..? నాగరాజు దంపతుల వ్యవహారం ఏమిటి..? ఎంతమంది వీరిచేతిలో మోసపోయారు..? ఎన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు..? అన్న విషయాలపై పూర్తి వివరాలతో వెలుగులోకి తీసుకుని రానుంది.. ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు