Friday, May 17, 2024

ఆర్.ఎస్.వీ.పీ. రాష్ట్రీయ విద్యార్ధి సేన పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

తప్పక చదవండి

మంగళవారం రోజు ఆర్.ఎస్.వీ.పీ. రాష్ట్రీయ విద్యార్ధి సేన పరిషత్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా లోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.ఎస్.వీ.పీ. జిల్లా అధ్యక్షులు చామకూరి మహేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్య వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారని అని, రాష్ర్టంలో దాదాపు 5300 కోట్ల రూపాయలు పైగా పెండింగ్ ల్లో ఉన్న ఫీజురియంబర్స్మేంట్. స్కాలర్ షిప్స్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థులు తమ ఉన్నత చదువురీత్య పై చదువులకు వెళ్లేందుకు తమ సర్టిఫికెట్స్ కోసం కళాశాల్లో కి వెళ్తే మీకు ఇంకా ఫీజురీయాంబర్స్మేంట్ పడలేదు పెండింగ్ లో ఉన్నాయి అవి పడ్డకే మీ యొక్క సర్టిఫికెట్స్ ఇస్తాము లేకుంటే పెండింగ్ ల్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పైసలు చెల్లించి మి సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళండి అనే పరిస్థితి కళాశాలలో ఏర్పడింది. పేద, నిరుపేద మధ్య తరగతి విద్యార్థులు ఇలా వేయిల రూపాలు చెల్లించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ల్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ ఆర్.ఎస్.వీ.పీ. రాష్ట్రీయ విద్యార్ధి సేన పరిషత్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

గురుకుల పాఠశాలల అని చెప్పి గురుకలు ఉన్నాయి గానీ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, హాస్టల్ సొంత భావనలు నిర్మించాలని, అదే విధంగా పెరుగుతున్న కర్చులరీత్యా విద్యార్థులకు మేస్ ఛార్జీలు కూడా పెంచాలని అదేవిధంగా ఉచిత బస్ పాస్ సౌకర్యం కూడా కల్పించాలని సూర్యాపేట పట్టణంలో మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం పథకంఎర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.గత తొమ్మిది సంవత్సరాల నుండి 8624 పాఠశాలలు మూతపడడం జరిగింది తెలంగాణ విభజన కంటే ముందు రాష్ట్ర బడ్జెట్లో ఎడ్యుకేషన్ కోసం 11శాతం నిధులు కేటాయించడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత 7 శాతం నిధులు కేటాయిస్తున్నారు. ప్రభుత్వ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ జరిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఉండదు సరైన సమయంలో స్కాలర్షిప్ పడక ఎంతో మంది పేద విద్యార్థులు విద్యకు దూరమై కేసీఆర్ ఇచ్చే గోర్లను బర్లను మేపుకుంటున్నారూ రాష్ట్రీయ విద్యార్ధి సేన పరిషత్ ప్రశ్నిస్తా ఉన్నది ఏమనంటే 1200 విద్యార్థులు బలిదానాలు గొర్ల కోసం బర్ల కోసం ఆత్మహత్యలు చేసుకోలేదు నాణ్యమైన విద్య కోసం కొలువుల కోసం బలిదానాలు చేసుకుంటే ఈరోజు విద్యార్థులను బర్లకు గొర్లకు అంకితం చేశాడు ఈయొక్క కెసిఆర్ అని అన్నారు తక్షణమే విద్యార్థులకి నాయం చేయాలని లేకుంటే ఉద్యమని ఉవెత్తున చేస్తాం అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.వీ.పీ. రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్, జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ లావురి వాసు, జిల్లా ఉప అద్యక్షులు దరవత్ తరుణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దినేష్, పట్టణ అధ్యక్షులు సీలోజు గౌతమ్, పట్టణ నాయకులు దుబని మల్లేష్, పేరం శివ, బాదే దినేష్, జాల నాగరాజు, జంప్పల శివ, భూక్యా మోహన్, మహేష్, సతీష్ కుమార్, వంశి తదితరులు పాల్గొన్నారు.. పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు