Saturday, July 27, 2024

కొత్త సేవలతో ఫోన్‌పే

తప్పక చదవండి
  • పన్ను చెల్లింపుదారులకు ఊరట..
  • ఫోన్‌ పే ద్వారా నేరుగా ట్యాక్స్‌లు చెల్లించే అవకాశం..
  • ఫోన్‌2పే పేమెంట్‌ అనే సంస్థతో ఫోన్‌ పే భాగస్వామ్యం.
    న్యూఢిల్లీ : దిగ్గజ యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫోన్‌పే అదిరే శుభవార్త తీసుకువచ్చింది. కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. నేరుగా ఫోన్‌పే యాప్‌ ద్వారానే ట్యాక్స్‌ కట్టొచ్చు. దీని వల్ల చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ట్యాక్స్‌ పేమెంట్‌ సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. పన్ను చెలింపుదారులు ప్రస్తుతం ఐటీఆర్‌ దాఖలులో నిమగ్నమై ఉంటారు. అందువల్ల ఫోన్‌పే కొత్త సర్వీసుల వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు చేయడానకి జూల్కె నెల చివరి వరకే అవకాశం అందుబాటులో ఉంది. ట్యాక్స్‌ దాఖలుకు గడువు పెంచే ప్రస్తక్తే లేదని ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పేసింది. అందువల్ల ఐటీఆర్‌ దాఖలు చేసే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఫోన్‌ తాజాగా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పేమెంట్‌ ఫీచర్‌ అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా కస్టమర్లు, బిజినెస్‌ చేసే వారు ఎవరైనా సరే సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అడ్వాన్స్‌ ట్యాక్స్‌ను ఫోన్‌ పే యాప్‌ ద్వారానే చెల్లించొచ్చు. దీని ద్వారా ట్యాక్స్‌ పోర్టల్‌కు వెళ్లాల్సిన పని లేదు. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఫోన్‌పే ఈ కొత్త సర్వీసులు తీసుకువచ్చింది. ఈ సర్వీసుల కోసం ఫోన్‌2పే పేమెట్‌ అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది డిజిటల్‌ బీ2బీ పేమెంట్స్‌ అండ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌. పన్ను చెల్లింపుదారులు వారి క్రెడిట్‌ కార్డు లేదా యూపీఐ ద్వారా పన్ను చెల్లించొచ్చు. క్రెడిట్‌ కార్డు కలిగిన వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు ద్వారా పేమెంట్‌ చేస్తే వడ్డీ రహిత కాలం లభిస్తుంది. అలాగే రివార్డు పాయింట్లు కూడా వస్తాయి. కేవలం ట్యాక్స్‌ పేమెంట్‌ చేయొచ్చు. అంతే కానీ ఫైల్‌ చేయడం కుదరదు. అంటే ఐటీఆర్‌ దాఖలు చేయాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఫోన్‌పే ద్వారా ట్యాక్స్‌ పేమెంట్‌ చేస్తే 2 వర్కింగ్‌ డేస్‌లో పేమెంట్‌ ట్యాక్స్‌ పోర్టల్‌కు క్రెడిట్‌ అవుతుంది. కాగా పన్ను చెల్లించాలని భావించే వారు ఫోన్‌పే యాప్‌లోని ట్యాక్స్‌ ఆప్షన్‌ ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు