Monday, September 9, 2024
spot_img

జగన్ ఇంకోసారి గెలిచినా అభ్యంతరం లేదు..

తప్పక చదవండి
  • సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన పవన్ కళ్యాణ్..
  • కానీ బెదిరింపులకు దిగితే నాలో రెండో కోణాన్ని చూస్తారు..
  • నీ పరిపాలన బాగుంటే నువ్వు గెలిచి చూపించు..
  • మకిలిపురం బహిరంగ సభలో నిప్పులు చెరిగిన పవన్..

అమరావతి,‘‘ జగన్ బాగా పరిపాలించి ఇంకోసారి గెలిచినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఎవ్వరూ పోటీ చేయకూడదని బెదిరిస్తే.. ఇప్పుటిదాకా రాజకీయ నాయకుడిని మాత్రమే చూశారు. కానీ విప్లవపంథాతో ఉన్న రాజకీయ నాయకుడిని జగన్ చూడలేదు’‘ అని సీఎం జగన్‌ను జనసేనాని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై తనకు వ్యక్తిగతంగా ద్వేషంలేదని పవన్ అన్నారు. కానీ సీఎం అయ్యాక తాను సర్వాధికారిని.. అందరూ తన బానిసలంటే.. నీ బాంచన్ దొర అంటూ.. నీ కాళ్లుమొక్కే వ్యక్తులంకాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారాహి యాత్రలో భాగంగా మలికిపురం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఈ మేరకు మాట్లాడారు.

వైసీపీ అవినీతి చదివేకొద్దీ తన కళ్ల సైట్ పెరిగిపోతుందని పవన్‌ అన్నారు. గోదావరి జిల్లాల్లో క్రిమినాలిటీని, చైన్ గ్యాంగ్స్, రౌడీ గ్యాంగ్స్‌ను తీసుకురావద్దని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చైన్ గ్యాంగ్స్, రౌడీ గ్యాంగ్స్‌ను పులివెందుల, ఇడుపులపాయలో పెట్టుకోవాలంటూ సీఎం జగన్‌పై పవన్ మండిపడ్డారు. వైసీపీ ప్రొత్సాహంతో క్రిమినల్స్ దాడి చేద్దామని చూస్తే.. తాను విప్లవకారుడినని, రౌడీలు, క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టులకు భయపడే వ్యక్తిని కాదని హెచ్చరించారు. అభివృద్ధిపై ఏం మాట్లాడినా కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజోలు విజయం గాయపడ్డ గుండెకు సేదతీరినట్లయిందని, రాజోలులో వెలిగించిన చిరుదీపం.. రౌడీలు, దౌర్జన్యాల పాలిట అఖండజ్యోతి అవుతుందని పవన్ స్పష్టం చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టడానికి తాను రాలేదని, కులాలను కలపడానికి రాజకీయాల్లోకి వచ్చానని పవన్‌ అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు