Monday, April 15, 2024

అత్యవసర వైద్యం.. అందనంత దూరం..

తప్పక చదవండి
  • మండలానికి 108అంబులెన్సు ఏది..?
  • అత్యవసర వైద్యం అందక జనం ఇక్కట్లు
  • 20 కిలోమీటర్ల దూరంలో 108 సౌకర్యం..
  • తక్షణమే అంబులెన్స్‌ ఏర్పాటు చేయండి..
  • డిమాండ్ చేసిన దౌల్తాబాద్ ఎంపీటీసీ, మంజుల దస్తప్ప ..

రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు, అకస్మాత్తుగా గుండెనొప్పో, మరే ఇతర అనారోగ్య కారణాలు ఎదురై అత్యవసర వైద్యం అవసరమైన పరిస్థితుల్లో గుర్తొచ్చేది కుయ్‌..కుయ్‌ అంటూ వచ్చే వాహనం 108. ఈ వాహనాలను అత్యవసర చికిత్సల కోసం మెరుగైన వైద్యకోసం తీసుకోని వెళ్లేందుకు ప్రతి మండల కేంద్రానికి ఒక్కటి వైద్యా ఆరోగ్య శాఖ కేటాయించింది. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ మండలానికి మాత్రం 108 సౌకర్యం అందనంత దూరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రక్కనున్న మండలాల నుంచే వాహనం రావల్సిన పరిస్థితిపై ‘ఆదాబ్ హైదరాబాద్ పత్రిక’ అందిస్తున్న కథనం.

మండలంలో పరిస్థితి :
మండలంలో 33 గ్రామ పంచాయతీలున్నా ఇందులో దాదాపు వేలకు పైగా జనాభా ఉంది. ఈ గ్రామాల్లో ప్రమాదవశాత్తు ఏమైనా ప్రమాదం సంభవించినా, అనారోగ్య కారణాలతో ఆస్పత్రికి వెళ్లాలన్నా ఇక్కడ 108 వాహనం అందుబాటులో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం వెళ్ళాలంటే ఇతర మండలాల నుంచి 108 వాహనం పిలుపించుకోవాలంటే సుమారు 25 కిలోమీటర్ల దూరం నుండి రావల్సిందే. ఈనేపథ్యంలో మండలంలో ఇలాంటి ఇబ్బందులు నిత్యకృత్యం. నాలుగు రోజుల క్రితం రావులపల్లి నుండి వస్తూ ఎదురు ఎదురుగ డీకొని అందులో ఒక్కరు కొన ఊపిరితో ఉన్న సమయానికి అంబులెన్సు లేక మార్గమధ్యలోనే చనిపోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నా పాలకులు, అధికారులు 108 వాహనాన్ని ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

- Advertisement -

దూరంగా శివారు గ్రామాలు :
మండలంలోని శివారు గ్రామాలలో తిరుమలపూర్, నాగసరం, సుల్తాన్ పూర్, అంతరం, గుండేపల్లి,సలీమ్ పూర్, ఓరగుంట తండా, గ్రామాలకు రహదారి సరిగ్గా లేదు. దీంతో పాటు చివరి గ్రామాలకు ఎటు వైపు నుంచి 108 వాహనం రావాలన్నా సుమారు 25 కిలోమీటర్ల దూరం నుంచి రావాల్సిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో మండల కేంద్రానికి 108 వాహనం కేటాయిస్తే ఇలాంటి ఏ ప్రమాదాలు సంభవించిన వెంటనే మెరుగైన చికిత్స కోసం తీసుకవెళ్ళవచ్చని ఆయా గ్రామాలు ప్రజలు కోరుతున్నారు.

వాహన సదుపాయం కల్పించాలి :
మండలంలో 108 వా హనం లేక అత్యవసర సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్నాం. అవసరమైనప్పుడు ప్రవేటు వాహనాలలో తీసుకవెళ్లిన అందులో సరైన సౌకర్యాలు లేక పోవడంతో ప్రాణనష్టం సంభవించింది. సకాలంలో వైద్య సేవల అందలంటే 108 వాహనం సరైన పరిస్థితుల్లో అందులో అవసరమైతే అత్యవసర ప్రాథమిక చికిత్సకు అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు మండల కేంద్రానికి ఒక్క 108 వాహనం సమకూర్చాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు