Wednesday, May 1, 2024

తెలంగాణ ఎన్నికలపై ఇసి ప్రత్యేక దృష్టి

తప్పక చదవండి
  • అధికారుల తీరుపై ఫిర్యాదుల వెల్లువ
  • పలువురు అధికారుల బదిలీతో కొత్తవారి నియామకం
  • హైదరాబద్‌ సిపి మినహా కొత్తగా ఎస్పీల నియామకం
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఎన్నికల కోడ్‌ అమలవుతున్న అక్టోబర్‌9వ తేదీ నుంచి ఈరోజు ఉదయం వరకు భారీగా నగదు పట్టుకున్నారు. దాదాపు 20, నుండి 25కోట్లకు పైగా సీజ్‌ చేశారు. షెడ్యూల్‌ విడుదల అయిన నాలుగు రోజుల్లోనే కోట్లాది రూపాయలు పట్టుబడటంతో ప్రత్యేక నిఘా పెట్టింది. ఎన్నికల నాటికీ డబ్బు పంపిణీ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉండటంతో ప్రత్యేక బలగాలను తెలంగాణ రాష్టాన్రికి సీఈసీ పంపించింది. మరోవైపు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్‌ సీపీ మినహా అన్ని పోస్టులకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం పంపిన ప్యానల్‌ నుంచి అధికారులను ఈసీ ఎంపిక చేసింది. యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్‌, నిర్మల్‌ కలెక్టర్‌గా ఆశీష్‌ సంగ్వాన్‌, రంగారెడ్డి కలెక్టర్‌గా భారతీ హోలీకేరి, మేడ్చల్‌ కలెక్టర్‌గా గౌతం, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్‌, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్‌ శర్మ, ఎక్సైజ్‌ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా క్రిస్టినా నియామకం అయ్యారు. నారాయణపేట ఎస్పీగా యోగేష్‌ గౌతమ్‌, కిరణ్‌ ప్రభాకర్‌ భూపాలపల్లి ఎస్పీ,. రాహుల్‌ హెగ్డే సూర్యాపేట ఎస్పీగా నియమితులు అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చేసింది. నవంబరు 30న పోలింగ్‌, డిసెంబరు 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. కొందరు ఐఏఎస్‌ లు, ఐపీఎస్‌ లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఇతర పార్టీలపై వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సవిూపిస్తున్న ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికారులపై పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాయి. జనగామ కలెక్టర్‌ శివలింగయ్యపై ప్రతిపక్ష నేతలు సీఈఓకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్‌, సీపీఎం, వైఎస్సాఆర్‌టీపీతో పాటు ఇతర నాయకులు ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు కలెక్టర్లపైనా ఆన్‌లైన్‌లో కంప్లైంట్స్‌ అందాయి. అధికార బీఆర్‌ఎస్‌ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆసిఫాబాద్‌ జిల్లా ఎస్పీ కే.సురేష్‌ కుమార్‌ను బదిలీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. సురేష్‌ కుమార్‌ నిబంధనలు ఉల్లంఘించి ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సన్మానించి ఫొటోలు దిగిన తీరును ఫిర్యాదుకు జత చేశారు. జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. డిజీపీ అంజనీ కుమార్‌పై కూడా నేరుగా ఈసీకి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి ఉన్నతాధికారులపై ఊహించని స్థాయిలో ఫిర్యాదులు చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం 20 మంది అధికారులపై వేటు వేసింది. మిగిలిన జిల్లాలు, నియోజకవర్గాల నుంచి ఆ అధికారి మాకొద్దంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. విధుల్లో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని లేఖలు ఇస్తున్నారు. సీఈఓను కలిసి ఫిర్యాదు చేయడమే కాకుండా ఈసీకి కూడా డైరెక్ట్‌ మెయిల్స్‌? పంపుతున్నారు. ఇప్పటి వరకు కలెక్టర్లు, ఎస్పీలు, కిందిస్థాయి ఆఫీసర్లపై భారీగా ఫిర్యాదులు చేశారు. ఈసీ సడెన్‌గా ఇరవై మంది అధికారులను బదిలీ చేయడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడిరది. కాంగ్రెస్‌, బీజేపీ మిగతా అన్ని పొలిటికల్‌ పార్టీలు రాష్ట్ర అధికార యంత్రాంగంపై ఫిర్యాదులు చేశాయి. గులాబీ పార్టీకి అనుకూలంగా కొందరు అధికారులు పనిచేస్తున్నారని, డబ్బు, మద్యం పంపిణీని గత ఉప ఎన్నికల్లో నివారించలేకపోయారని ఫిర్యా దు చేశాయి. పార్టీల నేతలు, ఇతరులు ఈ`మెయిల్స్‌ ద్వారా అధికారులపై ఈసీకి ఫిర్యాదులు పంపారు. తెలంగాణలో కొందరు అధికారులు బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలను వేధిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు. కొందరు అధికారులు కాంగ్రెస్‌ అభిమానులను, కార్యకర్తలను వేధిస్తున్నారని అటువంటి వారికి మిత్తితో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. పలువురు అధికారులు కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి పరులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ డీజీపీని తొలగించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అదేవిధంగా సైబరాబాద్‌ కవిూషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర కాంగ్రెస్‌ పార్టీ అభిమానులను బెదిరిస్తున్నారని , నిఘా పెడుతున్నారని ఆరోపించారు. అరవింద్‌ కుమార్‌, జయేష్‌ రంజన్‌ లాంటి అధికారులు వ్యాపారులను బీఆర్‌ఎస్‌ కు చందాలు ఇమ్మంటూ బెదిరిస్తున్నారని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు