Tuesday, September 10, 2024
spot_img

యాదాద్రి భువనగిరి జిల్లా వాసి భూక్యా సంతోష్ నాయక్ కి గౌరవ డాక్టరేట్..

తప్పక చదవండి

యాదాద్రి భువనగిరి జిల్లా, తురకపల్లి మండల వాసి భూక్య సంతోష్ నాయక్ కి గౌరవ డాక్టరేట్ వరించింది. చెన్నైకి చెందిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ సేవారంగంలో, సామాజిక రంగాలలో పనిచేస్తున్న యువతను విద్యవైపు ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేయడం.. బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు నిర్వహించడం.. సంబంధిత ప్రజల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం తన వంతు బాధ్యత గల పౌరుడిగా ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఇటీవల గౌరవ డాక్టరేట్ అందజేయడం జరిగింది. తమిళనాడులోని హుస్సుర్ ఈ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో భూక్య సంతోష్ నాయక్ మాట్లాడుతూ.. ఇంతటి స్థానం తనకు కల్పించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ ఈ డాక్టరేట్ తో తన బాధ్యత మరింత పెరిగిందని, సమాజం పట్ల తన బాధ్యతను మరింతగా కొనసాగిస్తానని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ బోర్డు ఫౌండర్ అండ్ కోచ్ విజయన్, అకాడమీ మాస్టర్ వి బాబు విజయన్, తమిళనాడు ఐ ఎన్ టి యు సి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె మనోహకరన్, రాజశేఖర్ స్వామీజీ, డాక్టర్ ఎస్ నారాయణ, డాక్టర్ సీఎం పంచశేఖరయ్య, మంజు, డాక్టర్ గుణవంత మంజు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు