Friday, May 3, 2024

ప్రశాంత వాతావరణంలో దీపావళి

తప్పక చదవండి
  • బాణాసంచా విక్రయాలపై నిఘా
  • ప్రమాదాలు జరక్కుండా ముందస్తు చర్యలు
  • పోలీసులను ఆదేశించిన డిజిపి

అమరావతి : దీపావళి పండుగ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ కమీషనర్లు, జిల్లా ఎస్‌పీలకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది దీపావళి సందర్భంగా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది బాణాసంచా తయారు చేసే, విక్రయించే దుకాణదారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించామన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా బాణాసంచా టపాసులు విక్రయిస్తుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాణాసంచా విక్రయించే దుకాణదారులు పోలీసులు సూచించిన నిబంధనలను పాటించాలి. పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్‌ కమీషనర్లకు, జిల్లా ఎస్‌పీలకు డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. గోదావరి జిల్లాలో మందుగుండు సామాగ్రి తయారీ, స్టోరేజ్‌ గోదాంలో అమ్మకాలు జరిగే ప్రదేశాలపై ఇప్పటికే ప్రత్యేకమైన నిఘా పెట్టామని డీజీపీ చెప్పారు. ఎవరైనా అనుమతి లేకుండా బాణ సంచా / టపాసులను ఇళ్లల్లో, షాపులలో, జన సముదాయాల మధ్య గోడౌన్‌లలో స్టాకు అనుమతి లేకుండా నిల్వలు చేసిన లేదా లైసెన్సు లేకుండా అనధికార విక్రయాలు జరిపిన, బాణాసంచా విక్రయించే దూకణదారులు పోలీసులు సూచించిన నియమనిబంధనలను తప్పని సరిగా పాటించకపోయినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా గోదావరి జిల్లాలో స్థానికంగా లభించే దీపావళి మందు గుండు సామాగ్రి తయారీ, స్టోరేజ్‌ గోడౌన్లు మరియు అమ్మకాలు జరిగే ప్రదేశాల పైన ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది.రాష్ట్రం లో ఎక్కడైనా అక్రమంగా మందు గుండు సామాగ్రి తయారీ చేసిన, విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు వెంటనే దగ్గరలోని స్థానిక పోలీసులకు సమాచారం అందించండి.అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దీపాల సందర్భంగా విక్రయాలు జరుపుకునేందుకు ఇప్పటి వరకు అధికారికంగా 3856 షాపులకు లైసెన్సు మంజూరు చేశారు.గతంలో జరిగిన ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులను గుర్తించి ఇప్పటివరకు 1223 మందిని బైండోవర్‌ చేయడంతో పాటు 429 మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 42,36,400 రూపాయల విలువైన దీపావళి మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.బాణాసంచా విక్రయించే దూకణదారులు ఈ క్రింది నియమనిబంధనలను తప్పని సరిగా పాటించాలి. బాణాసంచా నిల్వచేసే కేంద్రాల నిర్వాహకులు, తయారీ చేసేవారు, విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలి. బాణాసంచా విక్రయ దుకాణాలను జనావాసాలకు, విద్యాసంస్థలకు, హాస్పిటల్స్‌ కు దూరంగా అధికారులు సూచించిన ప్రదేశంలోనే బాణాసంచా విక్రయాలు జరగాలన్నారు.6. బాణాసంచా విక్రయ దుకాణాల మధ్య కనీస నిర్దిష్ట దూరం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.7. ప్రతీ దుకాణం వద్ద అగ్ని నిరోధక సిలెండర్లు, తగినంత పొడి ఇసుక, కావాల్సిన నీరు అందుబాటులో ఉండాలి.8. మైనర్లను బాణసంచా నిల్వచేసే కేంద్రాల వద్ద మరియు తయారీ లేదా విక్రయ పనుల్లో వారిని వినియోగించరాదు. అనుమతి పొందిన దుకాణదారులు అధికారులు సూచించిన సమయాల్లో మాత్రమే విక్రయాలు జరపాలి. ఆదే విధంగా దీపావళి రోజున సాయింత్రం 5 గంటల తరువాత ఎటువంటి అమ్మకాలను జరపరాదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు