Tuesday, February 27, 2024

ధరణి మాఫియా పాత్రధారి కేసీఆర్.. సూత్రధారి సోమేశ్ కుమార్.

తప్పక చదవండి
  • కాల్వలు తవ్వి నీళ్లు ఇచ్చిందే కాంగ్రెస్, కేసీఆర్ నీళ్లంటూ దుష్ప్రచారం.
  • యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు 10 ఏళ్ళు అయిన పూర్తి కాలేదు.
  • ఈ రాష్ట్రం సీఎం కెసిఆర్ చేతుల్లో నలిగిపోతుంది.
  • వందల ఎకరాల భూమి అమ్ముకొని ప్రజలకు సేవ చేసిన చరిత్ర కాంగ్రెస్ నాయకులది.
  • పదవిని అడ్డుపెట్టుకుని కోట్లు కొల్లగొట్టిన చరిత్ర బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులది.
  • నీళ్లు తీసుకురాలేదు, పవర్ తీసుకురాలేదు మంత్రులు ఉండి ఎం లాభం.?
  • రాబోయే ఎన్నికల్లో 100 సీట్లు గోలుస్తాం.
  • సూర్యాపేట జిల్లాలో మీడియా తో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

సూర్యాపేట, ధరణి మాఫియా పాత్రధారి కేసీఆర్, సూత్రధారి సోమేశ్ కుమార్ అని, ఈ రాష్ట్రం సీఎం కేసీఆర్ చేతుల నలిగిపోతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం సాయత్రం సూర్యాపేట జిల్లాలోని వేదిరేవారి గూడెం మీదగా జిల్లాకు చేరుకున్నారు బట్టి.. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదివారం మధ్యాహ్నం పట్టణంలోని అంతటి విజేయ్ ఫంక్షన్ హల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎల్పీ నేత బట్టి మాట్లాడుతూ.. కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు, ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం. ప్రజల జీవితాల్లో మార్పు రావడం కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం.. మరి తెలంగాణ వచ్చి దశాబ్ద కాలం అవుతున్నా ప్రజలకు ఇందులో ఏ ఒక్కటి కూడా రాలేదన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దల జీవితాల్లో మాత్రం అద్భుతమైన మార్పు వచ్చిందని, ఏ ప్రజల జీవితాల్లో మార్పు రావాలో.! ఏ ప్రజలకైతే సంపద చేరాలో వాళ్లకు చేరలేదన్నారు. వాళ్ల పేరు చెప్పి అధికారాన్ని అనుభవిస్తున్న వారికి మాత్రం అపారమైన సంపద సమకూరిందన్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు సమకూరాయని, వందల ఎకరాల ఫామ్ హౌస్ లు, వాటికి రోడ్లు వచ్చాయి అన్నారు. నయా గడీ సంస్కృతిని బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో తీసుకువచ్చారని, ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన వారసత్వంగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఫామ్ హౌస్ లు కట్టుకుని కొత్త ఒరవడిని తీసుకువచ్చారని ఎద్దేవాచేశారు. ఈ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన కాంగ్రెస్ పారీకి చెందిన మహా నాయకులంతా వందల ఎకరాల భూమి అమ్ముకొని ప్రజలకు సేవ చేసిన చరిత్ర ఉందని.. పదవీ కాలాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించుకున్న చరిత్ర బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులదని ఆరోపించారు. కేవలం ఈ పదేళ్లలోనే ఒక్కసారిగా బీ.ఆర్.ఎస్. నాయకుల జీవితాలు మారిపోయాయని, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను బీఆర్ఎస్ నాయకులు అపహాస్యం చేశారన్నారు. ఏమి ఉద్దరించారని దశాబ్ది ఉత్సవాలు, కాలువ పండుగలు, చెరువు పండగలు చేస్తున్నారని, నీళ్ల దగ్గరకు వెళ్లడం పసుపు, కుంకుమ, పూలు వేయడం, ఆ నీళ్లు తీసి నెత్తిన చల్లుకోవడం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏం సాధించారని ఏ నీళ్లు తెచ్చారని ఇదంతా చేస్తున్నారని ప్రశ్నించారు. నీళ్లు వృధాగా సముద్రంలోకి పోకుండా.. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును కట్టి, అక్కడనుంచి నీళ్లను మిడ్ మానేరుకు తీసుకువచ్చి, అక్కడనుంచి లోయర్ మానేరు, అక్కడ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీళ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు కట్టిన ప్రాజెక్టులు, తవ్విన కాలువల ద్వారా నీళ్లు వస్తుంటే, నీళ్లు తెచ్చిన కాంగ్రెస్ నాయకులకు దండం పెట్టాల్సింది పోయి, కేసీఆర్ నీళ్లంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలకు మోసపూరిత మాటలతో ఇంకా ఎంత కాలం మభ్య పెడతారని అన్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మాత్రమే. ఏ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నుంచి ఈ సూర్యాపేటకు నీళ్లు ఇచ్చారని ప్రశ్నించారు.? ఏ ఒక్క ఏకరానికైనా అదనంగా మీరు నీళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వీటికి స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి సమాధానం చెబుతారని అశించా, వాటికి జవాబులు చెప్పకుండా ఇద్దరు వంకర మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. మీరు నడిచి వచ్చిన రోడ్లు వేసింది బి.ఆర్.ఎస్. పార్టీ వేసింది అని, మీరు పీల్చే గాలి తెచ్చింది మేమే అంటున్నారని, హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాకా రోడ్లు వేసింది మీరా అని ప్రశ్నించారు. నేను చెబుతున్నా, ఈవాళ మీరు జల్లుకుంటున్న నీళ్లు కాంగ్రెస్ తెచ్చింది. నీ కారు వెళ్తున్న రోడ్డు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏసిందే. ఇక్కడ వెలిగే కరెంటు, ఇక్కడ జరుగుతున్న వంద రోజుల పని, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్య శ్రీ కార్డులు, సూర్యాపేటలో 5 వేల మంది పేదలకు ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నే అన్నారు. ఊరూరు మీరు పెంచిన బెల్టు షాపులే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి అని, తాగండి తాగండి, అమ్మండి అమ్మండి అని చెబుతూ.. ప్రతి గ్రామంలో మీరు సాధించిన ప్రగతి పరుగులు పెడుతుందన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నీ జిల్లాలో నువ్వు మొదలు పెట్టిన యాదాద్రి పవర్ ప్రాజెక్టు 10 ఏళ్ళు అయిన పూర్తి చేయలేదని, కనీసం ట్రయల్ రన్ కూడా కాలేదన్నారు. నీళ్లు తేలేదు, పవర్ తేలేదు మరి మంత్రులు ఉండి ఏమి లాభం అని ప్రశ్నించారు. మీ ధన దాహానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ రాష్ట్రం సీఎం కేసీఆర్ చేతిలో నలిగిపోతుందని, తెలంగాణలో ధరణితో భూ మాఫియా జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందులో భాగంగానే ప్రజలు పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఆదరిస్తున్నారని తెలిపారు. పాదయాత్రకు వస్తున్న ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి.. బీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. ధరణి మాఫియా పాత్రధారి కేసీఆర్.. సూత్రధారి సోమేశ్ కుమార్ అని, సోమేశ్ కుమార్ పక్క రాష్ట్రానికి బదిలీ అయినా కూడా అక్కడికి పంపించకుండా చేసిన భాగోతాలన్నీ బయటపడతాయని తీసుకొచ్చి, మళ్ళీ అక్కున చేర్చుకున్నారని అన్నారు. బిజెపి, బి.ఆర్.ఎస్ పార్టీ లు రాజకీయ అవసరాల కోసం ఒకరు, ఆర్థిక లావాదేవీల కొరకు మరొకరు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలవబోతుందని భీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, నల్లగొండ పార్లమెంటరీ ఇంచార్జ్ నిరంజన్, సినీ నిర్మాత బండ్ల గణేష్, టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి, పీపుల్స్ మార్చ్ కన్వీనర్ అబ్దుల్లా, అధికార ప్రతినిధి జ్ఞాన సుందర్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు